Sunday, April 28, 2013

రూలర్ -01

లక్ష కోట్ల అవినీతి పారిశ్రామిక వేత్త తో సిబిఐ ఆఫీసర్ చేసే ఫైట్. గుడ్ లవ్ స్టోరీ(కొత్తగా) ఉంది.స్టాక్ మార్కెట్స్ ను  దెబ్బతీసి, దేశ ఆర్థిక వ్యవస్థ ను నాశనం చేసే వాళ్ళ పనిపట్టే కథ .కోర్ట్ సీన్ బావుంది.మంచి మెసేజ్ ఉంది.ఇది పొలిటికల్ స్టోరీ కాదు. సినిమా కోసం రాసిన కల్పిత కథ.
                                                                                                        ---రచయిత (kcnaidu1@gmail.com)
రూలర్ Born For The Society
                                                                                     
పవిత్రానాయ సాధునాం వినాశాయ చదుష్క్రుతామ్!

ధర్మ పరిస్థాపనా పార్థాయ సంభవామి యుగే యుగే!!

"ప్రజలను రక్షించుటకు, దుర్మార్గులను నశింపజేయటకు ధర్మాన్ని పున:స్థాపించుటకు ప్రతి యుగమున నేను జన్మిస్థాను" అని శ్రీకృష్ణుడు  చెప్పాడు. 

“మన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు  ఏటా  నలభై ఐదు లక్షల కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నాయి. అంటే సగటున ఒక కుటుంబానికి  లక్ష్యా యాభై వేల  రూపాయలన్న మాట. ఆయినా ఇంకా ఇళ్ళు లేని పల్లెలున్నాయి .కరెంటు లేని విలేజ్ లు ఉన్నాయి.. రోడ్లు లేని గ్రామాలున్నాయి. మంచినీళ్ళు లేని ఊళ్ళున్నాయి. సాధారణ జ్యరానికే నేల రాలే  వారు వేలు. ఉద్యోగాల్లేక, పెళ్ళిళ్ళు కాలేక పరువు కోసం నరకయాతన అనుభవించే యువత లక్షలు. రెండు పూటల కడుపు నిండా తిండి లేని వారు అరవై కోట్ల పై మాటే. ప్రపంచంలోని నిరక్షరాసుల్లో సగం మంది భారతీయులే! మరి ఏమవుతుంది ప్రజాధనం? ....” 

నల్ల ధనాన్ని వెలికి తీస్తే ఇప్పటివరకు మన దేశం చేసిన అప్పులన్నీ తీర్చవచ్చని  అంచనా. ఇంకా మిగిలిన ధనాన్ని భారతీయులందరికీ   పంచి తే తలా లక్షరూపాయలు  పైగానే వస్తుందట....”

లక్షల కోట్లు...అక్రమార్జన...

ఇంతటి అవినీతి సంపాదన  ఎలా సాధ్యం ?

ప్రభుత్వాలు... వ్యవస్థలు ... ఏంచేస్తున్నట్లు..?

చట్టాలు లేవా? ఉంటే ఎందుకు అమలు చేయలేదు!?

మరి దుష్టశిక్షణ,ధర్మపరిరక్షణకు దేవుడు ఎప్పుడు ఎలా వస్తాడు..?



*****


శనివారం.

సమయం ఉదయం ఏడుగంటలు.

రామాలయం.

గుడి పరిసరాలు ప్రశాంతంగా,ఆహ్లాదకరంగా ఉన్నాయి. కోనేటిలో భక్తులు స్నానాలు చేస్తున్నారు. ధ్వజస్తంభం దగ్గర భక్తులు కొబ్బరి కాయలు కొడుతున్నారు. అక్కడక్కడ కూర్చూని సేదతీరుతున్నారు. కొబ్బరి చిప్పలు పగులగొట్టి, తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు.తల్లులు బిడ్డలకు పాలిస్తున్నారు. గుడి వాతావరణం అద్భుతంగా ఉంది. 

శనివారం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. క్యూ లో నిలబడి దైవ ధర్శనానికి వెళ్తున్నారు. గుడి లోపలినుండి వేదమంత్రాలు లీలగా వినిపిస్తున్నాయి. 

ఇంతలో ఒక్కసారిగా భారీశబ్దం. చప్పుడుకు పరిసరాల్లో ఉన్నా పావురాలు బెదిరిన చూపులతో, అరుపులతో దూరంగా పారిపోయాయి. భక్తులలో అయోమయం! మొదట బాణసంచా పేలుడేమో అనుకున్నారు. అయినా అంతా చప్పుడా అంటూ ఆశ్చర్యపోయారు. జరగరానిది ఎమో జరిగిందని అనుమానించారు. అది బాణాసంచా కాదు ... బాంబు! గర్భగుడి లో నుండి దట్టమైన పొగ ఆకాశం వైపు వెళుతొంది. భారీ ప్రేలుడు జరిగినప్పుడు ఏర్పడేపెద్ద శబ్ధం. ఆలయంలో గర్భగుడి ప్రక్కన పాలరాతి పీఠం కింద గుర్తు తెలియని వ్యక్తులు అత్యాధునిక ప్రేలుడు పధార్తాన్ని ఉంచి, సెల్ ఫొను ద్యారా రిమోట్ కంట్రోల్ పధ్దతితో పేల్చేశారు. దాని ధాటికి పది మంది అక్కడికక్కడె చనిపోయారు.  పూజారులు ప్రార్థన చేస్తున్న వారు అదే భంగిమ లో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు పిల్లలు కుడా ఉన్నారు. మరో యాభై మంది కి పైగా గాయపడ్డారు. గర్భగుడి వద్ద రక్తం మడుగు కట్టింది. మానవ మాంస ఖండాలు చెల్లాచెదురుగా పడిపొయాయి. పేలింది బాంబు అని తెలియగానే అక్కడంతా అల్లకళ్లోలం. భయానక వాతావరణం! ఎవరికి వారు బయటికిపడేందుకు తొక్కిసలాట! 

గుడి పరిసరాల్లో కూర్చుని, పసిబిడ్డకు పాలు పడుతోంది జ్యోతి. ప్రాణభీతితో భక్తులు గుడి ముఖద్యారం వైపు  పరుగు తీస్తున్నారు.ఏదో ప్రమాదం ముంచుకొస్తున్నదని గ్రహించింది జ్యోతి. బిడ్దను జాగ్రత్తగా పట్టుకుని పరుగులు తీయడానికి పైకి లేచింది. అంతలో ఎవరో బలంగా తోయడంతో అదుపు తప్పి పడిపోయింది. ఆమె చేతిలోంచి జారి పాప కొద్ది దూరంలో పడింది. క్రింద పడగానే పాప భయంతో కెవ్వున అరిచింది. 

 " పాప ...పాప..!!" అంటూ అరుస్తూ పాప దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించింది. ఉరుకుల పరుగుల మీద వస్తున్న జనం మళ్ళీ ఆమెను దూరంగా నెట్టేయడంతో ఆమె మరింత దూరంగా పడిపొయింది. 

"నా బిడ్డను కాపాడండి ! కాపాడండి ! " అంటూ ఆమె రోదిస్తోంది. ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తోంది. ఆమె అరుపులు అరణ్యరోదన గానే మిగిలిపోయాయి. ఇక పాపదగ్గరకు వెళ్ళడం కష్టం అనుకుంది. అయినా ఆమె పాప కోసం ప్రయత్నించింది.ఏదో పక్షి వింతగా అరచుకుంటూ ఎగిరిపోయింది.." 

గుంపులు గుంపులుగా వస్తున్నారు జనం. క్రింద పడి భయంతో ఏడుస్తోంది పాప. పాపను చూడకుండా ప్రాణభీతితో పరుగులు తీస్తున్న ఒకావిడ పాప పొట్ట మీద కాలు  పెట్టబోయింది. అంతలో ఆమె పాదాన్ని పాప శరీరం మీద పడకుండా తన కుడి చేత్తో ఆమె పాదాన్ని అలా ఆపి, పాపను ఎడమ చేతితో దగ్గరికి లాక్కున్నాడు విజయ్. 

జ్యోతి తన బిడ్డను కాపాడిన విజయ్ ను దూరం నుండి చూసింది. ఆమె కు అత ను తేజస్సు తో వెలిగిపోతున్న తారక రాముడిలా కన్పించాడు. లోక రక్షకుడిగా అవతారమెత్తిన శ్రీకృష్ణుడిలా కన్పించాడు. ఆమె అప్రయత్నంగా తన రెండు చేతులెత్తి అతడికి నమస్కరించింది. 

పాపను భుజాల మీదకు ఎత్తుకొని క్షణం వైపు చుట్టూ చూశాడు! చుట్టుప్రక్కలంతా జన ప్రవాహం, అర్తనాదాలు,అరుపులు,పొలికేకలు,ఏడుపులు.. అంతా దిక్కుతోచని పరిస్థితి. అయినా పాప తాలుకు వ్యక్తుల కోసం అతని కళ్ళు చురుకుగా గాలిస్తున్నాయి. 

పాపకోసం విజయ్ వైపు చూస్తూ, చేతులు ముందుకు చాపి "పాప...పాప..." అని అరిచింది జ్యోతి. దూరంగా ఉన్న అతనికి మాటలు విన్పించలేదు. అంతలో జనం అడ్దురావడంతో ఆమె కు అతను కన్పించలేదు. 

సంఘటన జరిగిన కాసేపటికి పోలీసులు వచ్చారు, పరిస్థితులు అదుపులో కి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పటికే భారీగా త్రోక్కిసలాట. ప్రాంగణమంతా చెప్పులే! 

కొద్ది నిముషాల్లోనే అంబులెన్సులు వచ్చాయి. అప్పటికే తేరుకొన్నకొందరు దుప్పట్లను స్ట్రెచర్లుగా మార్చి, రక్త మోడుతున్న క్షత గాత్రుల్ని అంబులన్స్ లోకి, ప్రైవేటు వాహనాల్లోకి చేర్చారు. ప్రేలుడు జరిగిన విషయం క్షణంలో దావానలంలా చుట్టుప్రక్కలంతా వ్యాపించింది. కొంత మంది పోలీసులకు, ప్రభుత్వానికి, ప్రతిపక్ష నాయకులకు, లీడర్లకు, వారి వారి శ్రేయోభిలాషులకు వార్తలను చేర వేస్తున్నారు. పత్రికల వాళ్లు, ఛానెళ్ళ వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా, వ్యతిరేఖంగా తమ ఎడిటర్ల సూచనలతోవార్తలను ప్రసారం చేస్తున్నారు.

వేల సంఖ్యలో అల్లరి మూకలు రోడ్ల పైకి చేరుకున్నారు. గుడి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహవేశాలతో విధ్వంసానికి దిగారు. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అల్లరిమూకలతో పాటు ప్రజలు కూడా దూరంగా పారిపోయారు. పాప కోసం బోరున విలపిస్తూ వైపు జ్యోతి, పాప ఆచూకి కోసం వెతుకుతున్న విజయ్ మరోక వైపు వెళ్ళిపొయారు. 

రాన్రాను పరిస్థితి అదుపు తప్పుతోంది. అల్లరి మూకలు దుకాణాలను,పెట్రోలుబంకులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు. రాళ్లవర్షం కురిపించారు. ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్తవాతావరణం నెలకొంది.పోలీసులు 144 సెక్షన్ విధించారు. నగరంలోని పోలీసులు హుటా హుటిన అక్కడికి తరలి వచ్చారు. పోలీసు దళాలు అల్లరి మూకల పైకి నీటి ఫిరంగులు, రబ్బరు తూటాలు... భాష్పవాయుగోళాలు ప్రయోగించారు. సుమారు రెండు గంటల తరువాత పరిస్థితి అదుపు లోకి వచ్చింది. 

అక్కడ్నుంచి ఇక చెసేదేమీలేక పాపను తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు విజయ్. 

******

"ఎన్నికలు వస్తున్నాయి గెలవాలంటే ఓటర్లకు కరన్సీనోట్లు,మద్యం పంపిణీ చేయాలి" పార్టీఫండు ఎవరెక్కువ ఇస్తారో, ఎన్నికల్లోఎవరెక్కువ ధనం వరదలా పారిస్తారో, వాళ్ళకు ఎన్నికల్లోనిలబడేందుకు సీటు గ్యారంటీ! అయితే దానికి కూడా డబ్బు కావాలి. డబ్బు సంపాదించాలి, త్వరగా డబ్బు సమకూర్చుకోవాలి... ఎలా? అన్న ఆలోచన రాగానే క్షణం కూడా ఆలస్యం చెయ్యలేదుఎమ్మెల్యే రాయన్న. మద్యం వ్యాపారి ధర్మారావుకు, నంబర్ వన్ కాంట్రాక్టర్ కోటయ్య కు ఫోన్ చేసి "సాయంకాలం పార్టీ ఉంది. రండి..." అంటూ ఆహ్వానించాడు. 

ఎమ్మెల్యేగెస్ట్ హౌస్ లో పార్టీ మొదలైంది. చిప్స్,చికెన్ ముక్కలు బంగారు వర్ణపు ద్రవాలు ఖాళీ అవుతున్నాయి. మద్యం రెండు పెగ్గులు పూర్తయ్యేసరికి సినిమా తారల రొమాన్స్ తో మొదలైన సంభాషణ సచిన్ బ్యాటింగ్ వరకూ వెళ్ళింది. 

గెస్ట్ లు మంచి మత్తులో ఉన్నారని కన్ ఫర్మ్ చేసుకొన్నాక అసలు పాయింట్ కి వచ్చాడు రాయన్న. 

"మీ వ్యాపారానికి ఇన్నాళ్ళు అండగా ఉన్నాను. దానికి ప్రతిఫలంగా మీరు నాకు నాకు కొంత ఇచ్చారు." ఇప్పుడు ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి. మీరు నాకుఅన్నిరకాలుగా సహాయం చెయ్యాలి. మీ రుణం ఉంచుకోను. నాకు మీకన్నా మంచి స్నేహితులు లేరు, సహాయం చేసే వాళ్ళు కూడా లేరు... అన్నాడు ఉఫోద్ఘాతంగా సెంటిమెంట్ తో. 

"మంచి వ్యాపార లక్షణం గల వాళ్లు ఎప్పుడూ పార్టీ కి అనుకూలంగా పని చెయ్యరు.చెయ్యకూడదు. ముఖ్యంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా..." అనుకొని తన తెలివితేటల్ని ప్రదర్శించాడు ధర్మారావు. 

"మీరు అడగాలా! మీలాంటి వారికి సాయం చెసే అదృష్టం  ఎంత మందికి లభిస్తుంది! రాబోయె ఎన్నికల్లో గెలిచి మన పార్టీ అధికారం లోకి వస్తుందని నాకు నమ్మకం ఉంది! కానీ ప్రతిపక్షం వాళ్లు సర్వే ఫలితాలు ప్రకారం మా పార్టీ రూలింగ్ లోకి వస్తుందంటున్నారు..." అని అర్ధోక్తిగా ఆపు చేశాడు. 

ఆమాటలకు  ఎమ్మెల్యే గట్టిగా నవ్వాడు! 

నవ్వు ప్రతిపక్షం వాళ్ళను గేలిచేసేటట్లున్నా . నవ్వుల్లో జీవంలేదని ఎమ్మెల్యే ముఖ కదలికల్ని చూసిన వారు గ్రహించారు. అయితే దాన్ని వాళ్లు వ్యక్తం చేయలేదు.

ఎమ్మెల్యే తన నవ్వును కంటిన్యూ చేస్తూనే అన్నాడు. "ప్రస్తుతానికి ప్రతిపక్షానికి కొంత పేరున్న మాట వాస్తవమే. అయినా పార్టీ ఎన్నికల్లో గెలవదు!

ఎమ్మెల్యే కోతల రాయుడు . తనకు అనుకూలంగా ఎన్ని మాటలైనా మాట్లాడుతాడని తెలిసినా సందేహం నటిస్తూ అడిగాడు కోటయ్య,"అంత కాన్పిడెంట్ గా ఎలా చెప్పగలరు?!" 

ఎమ్మెల్యే చెప్పబోయే సమాధానం కోసం ధర్మారావు,కోటయ్య ఆత్రుతతో  ఎదురు చూడసాగారు.వారి అనుమానం తొలగించడానికి ఎమ్మెల్యే చెప్పడం ప్రారంభించాడు. అయితే మాటలు తన తలరాతను మారుస్తాయని గ్రహించలేక పోయాడు! 

రెండు మూడు సినిమాలు చూసి ప్రేమంటే తనకు పూర్తిగా తెలుసునుకొని పెద్దల్ని ఎదురించే ఇంటర్మీడియట్ అమ్మాయిలా, ఎమ్మెల్యే రాజకీయాల గురించి మాట్లాడుతుంటాడు.తన బాస్ చెప్పేవి అపద్దాలు తెలిసినా, అతనికి భయపడి పొగిడే ఉద్యోగిలా వీళ్ళు  ఎమ్మెల్యే మాటలకు భజన చేస్తుంటారు.అయితే ఈసారి సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ గా ఉండడంతో కొంచెం శ్రద్ధగా వింటున్నారు. 

"మన ముఖ్యమంత్రి చాలా తెలివైన వాడు. తప్పకుండా మళ్ళీ మన పార్టీని రూలింగ్ లోకి తెప్పిస్తాడు. మన పార్టీ పై ఉన్న మమకారంతో కొన్ని చోట్ల ప్రజలు మనకే ఓటు వేస్తారు. కుల పిచ్చి అధికంగా ఉన్న ప్రాంతాలకుకులం వారికి సీట్లుస్తాం! నెలరోజులుండగానే మాస్ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని భారీ మొత్తం డబ్బు పంపిణీ చేస్తాం.ఈసారి వాళ్ళ వాళ్ళ మతం ఆధారంగా హిందువుల దగ్గరికెళ్ళి భగవద్గీత మీద, క్రిస్టియన్ల వద్దకు వెళ్ళి బైబిల్ పైన,ముస్లింల చెంతకు చేరి ఖురాన్ మీద... ప్రమాణం చేయించుకుంటాం. చచ్చినట్లు మనకే ఓట్లు వేస్తారు. సాధారణంగా సర్వే ఫలితాలు మాస్ మీద ఆధారపడి ఉంటుంది.డబ్బులిచ్చి నేషనల్ మీడియా ని కూడా మేనేజ్ చేస్తాం! మన పార్టీ వీక్ గా ఉన్న చోట్ల అవినీతి ఆఫీసర్లను ట్రాన్స్ ఫర్ చేయిస్తాం. రిగ్గింగ్ చేయిస్తాం. మందు, డబ్బుతో ..." అని చెప్పుకు పోతున్న ఎమ్మేల్యే మాటలు మద్యలోనే ఆగిపోయాయి. 

 అంతవరకు ఎమ్మేల్యే నోటి వెంట వెలువడుతున్న మాటలు హఠాత్తుగా మద్య లోనే ఆగిపోవడంతో ఎమ్మేల్యే ముఖం వైపు చూసి, తరువాత ఆయన చూస్తున్న కిటికీ వైపు చూశాడు ధర్మారావు,కోటయ్యలు. అంతే వాళ్ళ మద్యం మత్తు కూడా పూర్తి గా వదిలిపోయింది. 

స్థాణువులా అలాగే చూస్తుండిపోయాడు. ఎమ్మెల్యే రాయన్న కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. 

"ఒరేయ్! ఎవరో మనమాటల్ని వీడియో తీస్తున్నారు. వెళ్లి పట్టుకొండ్రా...వెళ్ళండి". అంటూ అరిచాడు. ఎమ్మెల్యే అనుచరులు సైనికుల్లా ముందుకు కదిలారు. వాళ్ళకంటే ఎమ్మెల్యే మాటల్ని ముందుగా రిసీవ్ చేసుకున్న శిరీష తప్పించుకోవడానికి ప్రయత్నిచింది. గోడపైకి నిచ్చెన సాయంతో వెళ్ళికిటీకీ గుండా  వీడియో తీస్తున్న ఆమె, నిచ్చెన దిగడం ఆలస్యం అవుతుందని గ్రహించి పై నుండి జంప్ చేసి, పరుగులు తీసింది.

కెమారాను జాగ్రత్తగా ఓచేత్తో పట్టుకొని పరుగెత్తుతోంది. ఆఅమ్మాయిని ని ఎమ్మెల్యే అనుచరులు వెంబడిస్తున్నారు. మెయిన్ గేటు దగ్గరకు వెళ్తే ప్రమాదమనీ, ఇలాంటి ఆపదలు ఎదురైతే ఎలా తప్పించుకోవాలో ముందే ప్లాన్ ప్రకం వచ్చింది కాబట్టి, ఎక్కువ టైమ్ వేస్ట్ చెయ్యకుండా గెస్ట్ హౌస్ వెనుక భాగం వైపు వెళ్ళింది. ప్రహరి గోడ  ఎక్కి అవతల ఉన్న రోడ్డుమీదకు జంప్ చేసింది. అనుచరులు కూడా ఆమెను ఫాలో అయ్యారు 

భయంతో జోరుగా పరుగెత్తుతోంది. ఎమ్మెల్యే అనుచరులు ఎలాగైనా ఆమెను పట్టుకోవాలని పట్టుదలతో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పరుగులుతీస్తున్నారు. వెంబడిస్తున్నారు. కొంతమంది షార్ట్ కట్ లో వెళ్ళరు. మరికొంతమంది ఆమెను వెంబడిస్తున్నారు. అందరూ రోడ్లవెంట పరుగులు తీస్తున్నారు. 

 ఆమె "హెల్ప్...హెల్ప్!" అంటూ అరుస్తోంది. 

షార్ట్ కట్ లో వెళ్ళిన వాళ్ళు ఆమెకు ఎదురొచ్చారు!. శిరీష భయపడి పరుగెత్తడం ఆపేసింది. ఫాలో అయిన వాళ్ళుకూడా దగ్గరకు వచ్చి నిలబడ్డారు. క్షణంలో వాళ్ళంతా ఆమెను సెంటర్ చేసారు. పులలమద్యలో లేడికూనలా ఉంది. భయంతో వణికిపోయింది. ఆదృశ్యం చుసిన పక్షులు ఆకాశంలో వింతగా అరుచుకుంటూ దూరంగా వెళ్ళిపోయాయి.