Sunday, April 28, 2013

రూలర్ కథ -17


వెయ్యి మంది ఉండే సభకు మంత్రిని, పదివేలమంది ఉండే సభకు ముఖ్యమంత్రిని   పిలిస్తే కాదనరు. లక్షల సంఖ్యలో అభిమానం ఉన్న విజయ్ పిలిచేసరికి ప్రధాన మంత్రి కాదనలేక పోయారు. తమ పార్టీ కి చెందిన ప్రధాన మంత్రి రాకతో ముఖ్యమంత్రి కూడా వచ్చారు. పెద్ద సంఖ్యలో ప్రముఖులు హాజరయ్యారు.

సభకు హాజరు కాలేని వారు టీవీ లలో లైవ్ షో చూస్తున్నారు.

ప్రధానమంత్రి ప్రసంగించారు. దేశంలోనే కనీ  వినీ ఎరుగని అతి పెద్ద సభ అన్నారు. సన్మాన సభకు ఇంతమంది జనం రావడాన్ని తను జీవితంలో చూడలేదన్నారు. ప్రపంచంలోనే పెద్ద సభ అన్నారు. ఇది మయ సభ లా ఉందన్నారు.

నాయకుడు జనంలోచి రావాలి. ఇలా జనాభిమానం ఉన్న నాయకుడు రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది.  ప్రజాభిమానం, సేవాభావం మెండు గా ఉండి అంకిత భావంతో పనిచేసే విజయ్ లాంటి వారు రాజకీయాల్లోకి రావాలి. పేదలకు సాయం చెయ్యాలని కోరుకుంటున్నాను...” మనసులోనే మాటను బయట పెట్టాడు ప్రధాన మంత్రి.

హర్ష ద్వానాలతో సభ మారు మ్రోగింది.

తరువాత న్యాయ మూర్తులు , మంత్రులు, పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడారు. పొగిడారు. మెచ్చుకున్నారు...

సన్మాన సభలు ఏర్పాటు చేసుకునేది పొగడ్తల  కోస మే కదా!

సన్మానానికి ముందు విజయ్ మాట్లాడవలసిందిగా సభకు అధ్యక్షత వహించిన వారు కోరారు.

విజయ్ మైక్ దగ్గరకు వెళ్ళాడు.

జనం ఈలలు, కేరింతలు, అరుపులు, కేకలతో సభ దద్ధరిల్లి పోయింది. విజయ్ మాట్లాడాడు.

"అందరికీ నమస్కారం! ముఖ్యంగా కృష్ణా నగర్ ప్రజలకు ..."అని కాసేపాగాడు. చప్పట్లు మారు మ్రోగాయి.

విజయ్ ప్రసంగాన్ని హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉన్న శిరీష టీవీలో లైవ్ షో చూస్తోంది!

విజయ్ తన మాటల్ని కొనసాగించాడు.

ఇన్నాళ్ళు నేనొక ఆశయం కోసం కష్టపడ్డాను. అహర్నిశలు శ్రమించాను. అది ఇన్నాళ్ళకు నెరవేర బోతోంది.

ఏటా మన  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు  ప్రభుత్వాలు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. అయినా రెండు పూటలా తిండి లేని ప్రజలున్నారు. ఉద్యోగాల్లేని  నిరుద్యోగులున్నారు. మంచినీళ్ళు లేని గ్రామాలున్నాయి .కరెంట్ లేని పల్లెలున్నాయి... మరి ఏమౌతుంది ప్రజా ధనం...??

చెప్పేది ప్రజా శ్రేయస్సు, వెచ్చించేది ప్రజా ధనం. మరి డబ్బెందుకు ప్రజా అవసరాలు తీర్చలేదు. ఎందుకు ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఏటా లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తుంటే, అవినీతి ఎంత వ్యవస్థీ కృత మైనదో తెలుస్తోంది. ప్రతి ఒక్కరు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చెయ్యాల్సిన సమయం ఆసన్నమైంది.

అందరూ శ్రద్ధగా వింటున్నారు. అక్కడి వాతావరణం సూది పడితే వినిపించే మాదిరి గా నిశ్శబ్దం అలుముకుంది. విజయ్ అవినీతి గురించి అలా మాట్లాడటం అక్కడున్న కొంతమందికి ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా సిబి జెడి ప్రకాష్ కి!

డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతున్నవారు రాజకీయాల్లోన్నే కాదు అన్ని చోట్లా ఉన్నారు. కుంభకోణాలు, మోసాలు, స్వాహాలు, టోపీల సంగతి నానాటికీ పెరిగి పోతోంది. అవినీతి అవసరంగా మొదలై వ్యసనం గా మారిపోతోంది. 'చిలక్కొట్టుడు' అవినీతి ఒకరకం, ప్రజా ధనాన్ని లూటీ చేసేది మరో రకం. రెండూ ప్రమాదాలే!

ఒకప్పుడు ఆదాయానికి మించి ఆస్తులు ఉండేవారు కొంతమంది. కానీ ఇప్పుడు నీతిగా బ్రతికే వాళ్ళను కాగడా పట్టి వెతకాలి!

అవినీతి జబ్బు ఎంత తీవ్రమైనదంటే లక్షల కోట్లు సంపాదించినా తనివి తీరడం లేదు. ఇంకా ఇంకా అనే కోరికతో బ్రతుకుతున్నారు.  అవినీతి వ్యవస్థ లో ఉన్న లొసుగుల్ని ఆధారంగా చేసుకుని ఎంత సంపాదించ వచ్చో ఎలా తప్పించుకోవచ్చో నా జీవితమే ఉదాహరణ.

నేను  మొదట అవినీతివ్యక్తీ తో చేతులు కలిపి   ఫ్యాక్టరీ కొన్నాను. తరువాత ఒక కాలేజ్ స్థాపించాను. దానిపై 'రెండు చోట్ల లోన్' తీసుకుని మరొకటి ...ఆపైన రెండింటి తో మరొకటి ...ఇలా హాస్పిటల్స్ కట్టాను. లారీలు కొన్నాను...ఇలా అప్పులతో, బినామీలతో బ్యాంకులను, ఫైనాన్స్  సంస్థలను మోసం చేశాను.

అలా నేను సంపాదించిన  సొమ్ము ఎంతో తెలుసా? ... అంటూ సభ వైపు చూసాడు. వాళ్ళు సమాధానం కోసం ఆత్రుత గా ఎదురు చూడ సాగారు.

"లక్ష కోట్లు!"

మీరు అంత డబ్బును చూడాలనుకుంటున్నారా... అయితే చూడండి. అని టీవీ రిమోట్ లాంటి దాన్ని నొక్కాడు. పెద్ద పెద్ద స్క్రీన్ల లో నోట్ల కట్టలు ప్రత్యక్ష్యం అయ్యాయి. వందలా రీ డబ్బు కుప్పగా పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంది దృశ్యం....

“లక్ష  కోట్ల సంపాదించాను. అంతా పేదల సొమ్ము. వారికే ఇచ్చేస్తాను. ఒక వ్యక్తి ఎలా అక్రమంగా సంపాదించ వచ్చో, మోసాలు చెయ్యొచ్చో, చట్టాల లొసుగులు ఆధారంగా ఎలా తప్పించుకోవచ్చో చెప్పే ఉదాహరణ ఇది.”

అందరూ ఆశ్చర్యం గా చూస్తున్నారు.

నేనేకాదు ఇక్కడ చాలా మంది అవినీతి పరులున్నారు.

లోకంలో పిచ్చి నైనా వదిలించ వచ్చు గానీ  డబ్బు పిచ్చిని వదిలించ లేం! ఇది సత్య దూరం కాదు. అవినీతి పరుల చర్యలను ఫోటో ద్వారా ,వీడియో ద్వారా ,ఆడియో ద్వారా  చిత్రీకరించి వారి వారి ఇళ్ళకు పంపించాను. ఇంకొక పది సెకండ్లలో మీ మీ సెల్  ఫోన్స్  లో ఎమ్మెమెస్(mms ), మెసేజ్ రూపంలో అవినీతి భాగోతాలు వస్తాయి...అన్నాడు.

అన్నట్లుగానే పదే పది సెకన్ల  లో  వచ్చేసాయి అవినీతి వార్తలు.వారిలో ప్రజలున్నారు. పోలీసులున్నారు. సభ పైన ఉన్న ప్రముఖులు కూడా ఉన్నారు.  అందరి ముఖాల్లో  చెమటలు పట్టాయి. ఖర్చీప్ లు తడిచిపోయాయి.

భయ పడ్డారు. బెదిరిపోయారు. ఏం చెయ్యాలో దిక్కు తోచని స్థితి లో పడి పోయారు.

"మీకేం భయం లేదన్నాడు..."విజయ్.

"అంతా ఒక్క  క్షణం  ఊపిరి పీల్చు కున్నారు".

విజయ్ కొనసాగించాడు. "ఇక మీరంతా నీతి బ్రతకాలి. అలా బ్రతికి నంత కాలం  మీ జోలికి రాను. ఇప్పటికే మీ మీ ఇళ్ళకు చేరిన డివిడి, ఆడియో ...లో మీరు చేసిన డబ్బు, మందు, చిలక్కొట్టుడు..అవినీతి భాగోతాలు మీకు, మీ కుటుంబాలకు చేరాయి.అవి మీ కుటుంబాలకే పరిమితం. ప్రస్తుతానికి వాళ్ళు మాత్రమె మిమ్మల్ని అసహ్యించు కుంటారు. అలా కాక పాత అలవాటు కు మారితే జైలే గతి!"

"అవినీతి అంతానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నడుం బిగించాలి. ఎటువంటి పట్టు విడుపులకు పోకుండా కలసి కట్టుగా పనిచేయాలి. అసెంబ్లీ లోనూ, పార్ల మెంటు లోనూ, లిఖిత పూర్వకం గా ప్రమాణం చేయాలి...బ్లాక్ మార్కెట్లకు, మోసగాళ్ళకు, అవినీతి పరులకు సపోర్ట్ చెయ్యమని చట్టం తేవాలి...అలా చేస్తే లక్ష్య కోట్ల ధనాన్ని ప్రజలకు ఇచ్చేసి కోర్టులో లొంగి పోతాను....

"చెప్పండి. చేస్తారా..." వేదిక పైన ఉన్న పెద్దల్ని అడిగాడు.

"తప్పకుండా ". అన్నారు ముక్త  కంఠం  తో.

"ఇలాంటి గొప్ప ఆశయానికి సాయం చేసిన లాయర్ జ్యోతికి, నా పర్సనల్ సెక్రెటరీ కల్పన కు, కృష్ణా నగర్ కాలనీ వాసులకు, 'నా వాళ్ళందరికీ ' పేరు పేరున కృతఙ్ఞతలు...” అన్నాడు విజయ్.

సభ అంతా తప్పట్లతో మారు మ్రోగింది.

"లక్ష  కోట్ల డబ్బు ఎక్కడుం దోనని ఆందోళనలు వద్దు. ఇక్కడే ఉంది చూడండి..." అన్నాడు.

బటన్ నొక్కాడు.

సభాస్థలి లోనే  డబ్బుంది!

స్టేజ్ కి ఆనుకుని ఉన్న పది హీను మీటర్ల స్థలంలో పెద్ద బావి ఏర్పాటు చేసి, దాన్ని అధునాతన టెక్నాలజీ ఉపయోగించి తలుపులు ఏర్పాటు చేశాడు. రిమోట్ తో డోర్స్ ఓపెన్ చేయగానే నల్ల ధనం బయట పడింది.

అందరూ డబ్బును ప్రత్యక్ష్యంగా చూడడానికి ఎగబడ్డారు.కలకలం మొదలైంది.

పోలీసులకు  సాక్ష్యా దారాలు దొరగ్గానే అరెస్ట్ కు సిద్ధం అయ్యారు.

అలా పోలీసులు దగ్గరకు రావడం గమనించి, "ఒక్క నిమిషం ఆగండి..."అని రిక్వెస్ట్ చేశాడు విజయ్. అయినా వాళ్ళు ఆగలేదు. విజయ్ ప్రధాన మంత్రి వైపు చూశాడు. ఆయనఆగమన్నట్లు సైగ’ చేసాడు.

విజయ్ మైక్ అందుకున్నాడు.

అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు. ఎక్కడివాళ్ళక్కడే అలాగే ఆసక్తిగా చూశారు. అతను అందరికీ ఆరాధ్య దైవం అయిపోయాడు.

"ఇలాంటి డబ్బులు చాలా మంది దగ్గర ఉన్నాయి! విదేశాలలో దాచి పెట్టిన బ్లాక్ మనీని తెచ్చి పంచితే మనదేశం అప్పులన్నీ పోగా, మనిషికి లక్ష రూపాయలకు పైగా  పంచ వచ్చని అంచనా! ప్రయత్నించండి. నల్ల ధనాన్ని వెలికి తీయండి. బలమైన జన లోక్ పాల్ బిల్ తీసుకు రండి. షరతులు లేని ప్రజలకు ఉపయోగ పడే చట్టం తీసుకు రండి. రౌడీలకు కొమ్ముకాయొద్దు,ఎమ్మెల్యేలు, ఎంపీలు రాగ ద్వేషాలకు పోకుండా ప్రజలకు ఉపయోగపడే చట్టం తెండి...ఇప్పుడు నేను పోలీసులకు లొంగి పోతున్నాను. మన సహనానికీ ఒక హద్దు ఉంది. లిమిట్ ఉంది. దాన్ని దాటనివ్వొద్దు.లిమిట్ దాటి తే ప్రతి ఒక్కరూ కథా నాయకులవుతారు...అప్పుడు నేను విదేశాలనుండి నల్ల ధనం తేవడానికి, బలమైనజన్ లోక్ పాల్ బిల్ తేవడానికి రాజ కీయాల్లోకి తారక రాముడిలా వస్తాను. రామ రాజ్యం తెస్తాను..."అన్నాడు విజయ్.

మాటలకు పైనుండి పూల వర్షం కురిసింది.'పై' నుండి పెద్దలు ఆశీర్వదించారు. ప్రజలు జేజే లు పలికారు. హర్షద్వానాల మద్య అలా పోలీసుల ముందుకు వెళ్ళాడు విజయ్.

1 comment:

Manabalayya said...

kevvu keka