Sunday, April 28, 2013

రూలర్ కథ -16


"మళ్ళీ ఒకసారి నా సాక్షి ని విచారణ చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోర్తువారిని ప్రార్ధిస్తున్నాను..." అంది డిఫెన్స్ లాయర్ జ్యోతి.

"అబ్జె క్షన్" అన్నాడు సిబి లాయర్ రమేష్.

"ఆఖరి అవకాశం అడగటం లో తప్పేముంది ?" అంది జ్యోతి రిక్వెస్ట్ గా . అవి సి బి లాయర్ని ఎగతాళి చేసే టట్టు న్నాయి. అతను గ్రహించాడు. అయినా చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోయాడు.

"అబ్జె క్షన్ వర్ రూల్ద్" అన్నాడు జడ్జ్.

మెజిస్ట్రేటు అనుమతి ఇవ్వగానే విజయ్ దగ్గరకు వెళ్ళింది జ్యోతి.

" ఫోటోలు, రెకమెండేషన్ లెటర్లు నీవేనా?".

"అవును".

"వాళ్ళు నీకేమవుతారు. ..ఎందు కెళ్ళావు?"

"ఆయా సంస్థల యజమానులలో చాలా మంది నా కొలీగ్స్, స్టూడెంట్స్ ,వారి పేరెంట్స్, ఫ్రెండ్స్ ఉన్నారు! వారు మమకారంతో పిలిస్తే వెళ్లాను. కొన్నింటికి మొహమాటంగా, మరికొన్నింటికి తప్పనిసరిగా! అలాగే కాలనీ వాసుల్లో చాలామంది పరిచయం ఉన్న వాళ్ళు తిండిలేక, విద్య, వైద్యం లేనివాళ్ళు సాయం అడిగితే రికమెండ్ చేశాను. నేను రికమెండ్ చేసిన వాళ్ళ ని చాలామంది ని తీసుకోలేదు. తీసుకున్న వారిని కూడా చాలా మందిని తీసేశారు. టాలెంట్ ఉన్నవాళ్ళకు , కష్టపడే వాళ్ళ కు మాత్రమె ఉద్యోగాలు ఇచ్చారు. అందరికీ అవ్వలేదు! నా సంస్థలు అయితే అలా చేసేవాళ్ళు కాదుకదా!"

"దట్సాల్ యువరానర్! నా క్లయింట్ అమాయకుడు . నిర్దోషి. సాక్షాధారమూ లేకుండా సమాజంలో పది మందికి సేవ చేస్తూ ఒక మంచి పౌరుడిగా ఉన్న నా క్లయింట్ ను కోర్టుకు ఈడ్చారు. అతడి పరువు, ప్రతిష్ట లను మంట గలిపారు. అవినీతి పరుడని పుంఖాను, పుంఖాలు గా ఆర్టి కల్స్ రాశారు. అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వం అండదండలతో సిబి నా క్లయింట్ ను అరెస్ట్ చేసింది. ఇలా నా క్లయింట్ పై తప్పుడు కేసులు పెట్టిన వారిపై త్వరలో చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం..."

సిబిఐ లాయర్ మాట్లాడలేదు!

సిబిఐ జెడి వైపుచూసింది లాయర్ జ్యోతి. అతడి ముఖంలో జీవం లేదు. సిగ్గుతో తల వంచుకున్నాడు.

రెండ్రోజుల్లో జడ్జ్ మెంట్ కాపీ బయటకు వచ్చింది. జడ్జ్ మెంట్ కాపీ చదివి విన్పించారు.

"విజయ్ నిర్దోషి! అతడు తప్పు చేసినట్లు, అక్రమాలకూ పాల్పడి  నట్లు రుజువులు లేనందున కోర్టు నిర్దోషిగా  విడుదల  చేసింది. అలాగే సంఘటనలకు భాధ్యలైన అసలు దోషులను పట్టుకోవాలనీ, సంఘంలో పెద్ద మనుషులుగా ఉన్న వారి పట్ల వ్యక్తి స్వేచ్చ కాపాడాలనీ పోలీసులకు తెలిపింది. తప్పుడు కేసులు పెట్టకూడదని సిబి కి చురకలు అంటించింది..."

జడ్జ్ మెంట్ వినగానే కోర్టు బయట ఉన్న జనంలో హర్షాతిరేఖలు మిన్నంటాయి. విజయ్ ను చూడగానే వచ్చి జేజేలు పలికారు. అతడ్ని దేవుడిలా ఊరేగించారు. ప్రజల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అలా విజయ్ జనంలో తారక రాముడిలా ఊరేగుతున్నాడు.

విజయ్ ను అలా చూస్తుండి పోయింది జ్యోతి. సిబి జెడి ఆమె దగ్గరికి వచ్చాడు.

"మీలాంటి లాయర్లు ఉన్నారని ఆనాడు గాంధి ని చంపిన గాడ్సేకి తెలి సుంటే  తలెత్తుకుని , కాలర్ ఎగరేసుకుని తిరిగేవాడు... !"

చాలా పదునైన మాటలు. ఆమె హృదయానికి సూటిగా గ్రుచ్చుకున్నాయి. పదునైన బాణం వచ్చి తన  హృదయానికి గ్రుచ్చు కున్నట్లు బాధ తో విలవిల్లాడి పోయింది.

*****

సన్మాన సభ

భారీ బహిరంగ సభ లో విజయ్ కు సన్మానం.

విజయ్ కోసం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సన్మాన సభ.

కృష్ణా నగర్ కాలనీ వాసులు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్, శిరీష ఇండ స్ట్రీస్ కార్మికులు , ఉద్యోగస్తులు...ప్రిస్టేజ్ గా ఫీలవుతూ ఏర్పాటు చేసిన  సభ. భారీ ప్లెక్సీలు, కటౌట్లు...ఎన్నికల ప్రచార సభలా ఉంది.

సన్మాన సభకు అశేష జనావళి తరలి రావడంతో కృష్ణా నగర్ పరిసర ప్రాంతాలు క్రిక్కిరిసి పోయాయి. విజయ్ కోసం ఏర్పాటు చేసిన సభకు విశేష స్పందన వచ్చింది. ఎక్కడ చూసినా జనం. ఇసుక వేస్తె రాలనంత జనం. సభ ప్రారంభానికి ముందే జనాలు సభా ప్రాంగణానికి చేరుకోవడం మొదలైంది.

సభా స్థలికి వస్తున్నా ప్రతి ఒక్కరిని నిశితంగా పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలు జరక్కుండా భద్రతను కట్టు దిట్టం చేశారు. సభా ప్రాంగణానికి అగ్గిపెట్టెలు, లైటర్లు, వాటర్ బాటిళ్ళు, సిగరె ట్లూ...అనుమతించలేదు. పొద్దు గడుస్తున్న కొద్దీ పోలీసులకు, వాలంటీర్లకు ఇబ్బందులు కలిగాయి. వేదిక ముందు భాగంలో ప్రత్యేకించి వి పి కు, మీడియా వారికి  గ్యాలరీలు ఏర్పాటు చేసారు.విచిత్రమేమిటంటే చాలా మంది పోలీసులు సభాస్థలిలో కన్పించారు. స్టేజీ ని పదిహేను మీటర్ల అవతల ఎత్తైన  ప్రదేశం లో అరేంజ్ చేశారు.

వేదిక కొద్ది దూరంలో ఉండడం చేత స్టేజ్ పైన ఉన్న వాళ్ళు కన్పించక ప్రజలు అవస్థలు పడ్డారు. పలువురు కుర్రాళ్ళు సౌండ్ బాక్సుల పైకి, సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కటౌట్ల పైకి ఎక్కి వేదిక పైన ఉన్న వారిని చూసేందుకు ఎగబడ్డారు. స్టేజ్ పైన చాలా మంది ప్రముఖులు ఉన్నారు! అది కాస్త హడావుడికి కారణమైంది. స్టేజ్ పైన వాళ్ళను చూసేందుకు అక్కడక్క డా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

1 comment:

Anonymous said...

ఇది నవలా లేక కథా ? తెలుగు దేశం కరపత్రం లా ఉంది