Sunday, April 28, 2013

రూలర్ కథ -15


కోర్టు హాలు.

విజయ్ బోనులోకి వెళ్ళాడు. జడ్జ్ తన సీట్లో కూర్చున్నాడు. ప్రేక్షకుల గాలరీలో కుర్చుని వున్నాడు ఆనందరావు. కంపెనీ సెక్రటరీ కల్పన, సిబిఐ జెడి ప్రకాష్ కూడా హాజరయ్యా రు. అంతలో అక్కడికి లాయర్ జ్యోతి వచ్చింది.  సిబిఐ లాయర్ రమేష్ ఆమె వైపు అదోలా చూశాడు.  ఆమె పట్టించుకోలేదు.

జ్యోతి ని  చూడగానే అదిరిపడ్డాడు ప్రకాష్. ఆమె దేశంలోనే టాప్ టెన్ లాయర్ల లో ఒకరు. నిజాయితీ పరురాలిగా పేరుంది. ఆమె ఇలా రావడం అతనికి ఆశ్చర్యాన్ని కలుగజేసింది.

'భారతీయ సాక్షా ధారాల చట్టం' ప్రకారం ఇలాంటి కేసుల్లో నేరాన్ని ఎక్కువగా నిరూపించాల్సిన భాద్యత ఎక్కువగా ప్రాసిక్యూషన్ మీదే ఉంటుంది.

 సిబిఐ లాయర్ రమేష్ తన వాదనల్ని ప్రారంభించాడు.

"యువరానర్! ఇంతకు ముందు జరిగిన సంఘటనలు బ్రీఫ్ చేస్తాను. విజయ్ తన బినామీలతో అక్రమం గా డబ్బు సంపాదిస్తున్నాడు. మోసాలు చేస్తున్నాడు.ఐదేళ్ళ క్రితం ఏమీ లేని ఇతను ఆర్ధిక నేరాలు చేసి డబ్బులు సంపాదించాడు.  ఇతను తన బినామీ తో కలిసి ఒకేసారి బ్యాంకుల నుండి డబ్బులు విత్ డ్రా చేయించి, బ్యాంకులను దివాలా తీయించి, స్టాక్ మార్కెట్లను, ప్రజలను తప్పుదోవ పట్టించాడు. ఇతని వలన స్టాక్ మార్కెట్ లో  ఒకేరోజు 4 లక్షల కోట్లు నష్టం జరిగింది. ఇతడి అక్రమ సంపాదనను జప్తు చేసి పేదలకు పంచాలని, ఇతడ్ని కఠినంగా శిక్షించాలని  కోర్టు వారిని కోరుకుంటున్నాను..."


జ్యోతి లేచి అతని మాటలకు అడ్డుపడు తూ "నా క్లయింట్ తప్పు చేశాడని రుజువు కాకుండానే శిక్షలు గురించి మాట్లాడుతున్న సిబిఐ లాయర్ ను చూస్తే జాలేస్తుంది. పత్రికల్లో వచ్చిన ఊహాజనితమైన వార్తలకు కట్టు కథలు అల్లి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నాడు. లాయర్ కి రైటర్ గా మంచి భవిషత్తు ఉంది!  నా క్లయింట్ నేరం చేశాడని చెప్ప డానికి ఏమీటీ ఆధారం...."

రమేష్ కోపంతో అన్నాడు. " వృత్తి లో నాకు పాతికేళ్ళ అనుభవం ఉంది. ఎలా మాట్లాడాలో తెలుసు! మీరు క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అనుమతిస్తే నిరూపిస్తాను యువరానర్..."

'పర్మిషన్ గ్రాం టెడ్' అన్నాడు జడ్జ్.


సిబిఐ లాయార్ ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. తరువాత గొంతు సవరించుకున్నాడు. అలా ప్రశ్నలు అడగడానికి విజయ్ దగ్గరకు వచ్చాడు.

అతడి ప్రేపరేషణ్ చూడగానే డిఫెన్స్ లాయర్ జ్యోతికి నవ్వొచ్చింది. కోర్టులో అనవసరంగా నవ్వకూడదని కంట్రోల్ చేసుకుంది. విజయ్ ను చూసింది. సైగలతో అతడికి ధైర్యం చెప్పింది.


"నీ పేరేమిటీ?" సిబిఐ లాయర్ రమేష్ ప్రశ్నించాడు.

విజయ్ చెప్పాడు.

"ఐదేళ్ళ క్రితం ఎక్కడ పనిచేసేవారు?"

సిటీ కాలేజ్ లో.

" జాబ్?".

లెక్చరర్ గా .

"అప్పుడు మీకు నెలకు జీతమెంత?"

సుమారు ఫాతిక వేలు.

" అలాగయితే  ఫాతిక వేల జీతం తో శిరీష ఇండ స్ట్రీస్ ఎలా కొన్నారు? శ్రీ కృష్ణా లారీ సర్వీసెస్, శ్రీకృష్ణా విద్యా సంస్థలు, శ్రీకృష్ణా హాస్పిటల్స్....కు పెట్టుబడి ఎలా వచ్చింది. వాటిని ఎలా సొంతం చేసుకున్నారు...."


ప్రశ్న అర్థం కా నట్లు ముఖం పెట్టాడు. మీరగుతున్న ప్రశ్న ఏమిటో కూడా నాకు అర్థం కాలేదు. వాటికీ నాకు సంబంధం లేదు! శిరీష ఇండ స్ట్రీస్ లో నేను మామూలు 'ఉద్యోగి' మాత్రమె!"

"వ్వాట్!" అని  అదిరిపడ్డాడు లాయర్ రమేష్ .

"యస్. నాకూ వాటికీ సంబందం లేదు. నా పేరు మీద సంస్థ లేదు. రిజిస్ట్రే షన్ కూడాలేదు..."

"ప్రేక్ష కుల గ్యాలరీ లో ఉన్న ఆనందరావు ఉలిక్కిపడ్డాడు. "న్నో... కంపెనీ అతనిదే. నా దగ్గరే కొన్నాడు...." అని గట్టిగా అరవాలనుకున్నాడు. ఎలుగెత్త లేక పోయాడు.

అంతలో జ్యోతి లేచి నిలబడింది. " అబ్జెక్ట్ యువరానర్... నా క్లయింట్ కు సంబంధం లేని  ప్రశ్నలు  అడిగి కోర్టు సమయం వృధా చేస్తున్నారు! సరియైన ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు...."

మాటలకు జ్యోతి వైపు కోపంగా చూసాడు. తరువాత జడ్జ్ వైపు తిరిగి అన్నాడు.

"మిలార్డ్! కేసుకీ దీనికీ సంబంధం ఉంది. అలాగే అతని బినామీ సంస్థల గురించి సిబిఐ 'అన్ని' ఆధారాలు సేకరించింది. మీరు అనుమతిస్తే మరి కొన్ని ప్రశ్నలు అడిగి ముద్దాయి నోటి వెంటే సమాధానం చెప్పిస్తాను...."

"అబ్జె క్షన్ ఓవర్ రూల్ద్ ..." అన్నాడు జడ్జ్.

"మీరు శిరీష ఇండ స్ట్రీస్ కొనలేదా! కంపెనీ మీది కాదా? దానికీ మీకు సంబంధం లేదా? బ్యాంకు  నుండి కంపెనీ పేరు మీద అప్పుచెయ్యలేదా... ?"

"లేదు. లేదు. నేను కంపెనీ కొనలేదు. కంపనీ ఇప్పటికీ దాన్ని స్థాపించిన ఆనందరావు పేరుమీదే ఉంది. నేను ఆయన పర్సనల్ సెక్రెటరీ ని. కంపెనీ నష్టాల్లో ఉంటే లాభాల బాట పట్టించడానికి నా సాయం  కోరాడు. కంపెనీకి ఇంచార్జ్ చేశాడు. కంపనీ వ్యవహారాలూ చూసుకోవడానికి నాకు 'కొన్ని' అధికారాలు ఇచ్చాడే తప్ప, నాకూ కంపెనీ కి ఎటువంటి సంబంధం లేదు... నేను కంపెనీలో ఆనందరావు గారి పి.. మాత్రమే!"

అప్పుడు గుర్తొచ్చింది ఆనందరావుకు. రిజి స్ట్రేషన్ ఫీసులో రోజు జరిగిన సంఘటనలు. రోజు చాలా డాక్కు మెంట్స్ పై సంతకాలు చేశాడు. అప్పుడే డౌట్ వచ్చింది ఆనందరావుకు.

"ఇన్ని డాక్కు మెంట్లా!" అని రిజి స్ట్రార్ ఆఫీసు వాళ్ళ ను అడిగాడు. వాళ్ళు దానికి సమాధానంగా ,"రూల్స్ మారాయి...ఫార్మాలిటీస్" అన్నారు. శేఖర్  కూడా అవునన్నాడు. నమ్మించాడు.


అంటే డబ్బులతో రిజి స్ట్రార్ ఆఫీసు వాళ్ళను, శేఖర్ ను మేనేజ్ చేశాడు. బ్యాoకు డాక్కు మెంట్ల పైనా, కంపెనీ ఇంచార్జ్  ఫైల్స్ మీద సంతకాలు తీసుకున్నాడు. తనపేరు మీదే అప్పులు చేసి, తన కంపెనీ నడుపుతున్నాడు. లావా దేవీలన్నీ తన మీద చేస్తున్నాడు. కంపెనీ లో జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు భాధ్యలు..." తలుచుకోగానే ఆనంద రావు వెన్నులో వణుకు పుట్టింది.

కానీ ఆరోజు విజయ్ అలా ఆలోచించలేదు.

శిరీష ఆనంద రావు ఏకైక కూతురు! ఆస్తి తనపేరు మీద వున్నా, ఆనందర రావు పేరు మీద ఉన్నా ఒకటే అనుకున్నాడు. కానీ అదికూడా ఇలా కలిసి వచ్చినందుకు సంబర పడిపోయాడు!

సిబిఐ లాయర్ తన మాటల్ని కొనసాగించాడు. "యువరానర్! ముద్దాయి చాలా తెలివైన వాడు. అతనికి చాలా మంది బినామీలు ఉన్నారు. వారికి తమ కంపెనీలో చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చి అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించాడు. వాళ్ళు ఇవేమీ తెలియక సాధారణ ఉద్యోగులుగా బ్రతుకు తున్నారు! దేశంలో ఇలాగే చాలా మంది ఉన్నారు. ఫ్యాక్షన్ లీడర్ల దగ్గర , పారిశ్రామిక వేత్తల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర...పనిచేసే  వాళ్ళ మీద కోటాను కోట్ల ఆస్తులుంటాయి...వాళ్ళ దగ్గర రహష్యం గా రాయించుకున్న అగ్రిమెంట్ల మూలంగా వాళ్ళు సాధారణ జీవితం గడుపుతునారు. రెండు పూటలా తిండి లేక బ్రతికే పాలేర్ల మీద కోట్లు ఆస్తులుంటాయి. సరిగ్గా అలాంటి 'ట్రిక్' ప్రయోగించి ఇతను వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు...."

డిఫెన్స్ లాయర్ జ్యోతి అడ్డు తగిలింది.

"యువరానర్! లాయర్ గారు కథలు అల్లడంలో దిట్ట! సినిమాలలో కథలకు కొంచెం డిమాండ్ ఉంది. అక్కడ ట్రై చేస్తే బెటర్ లేదా ఫిక్షన్ కథలు రాయొచ్చు! అంతేకాని ఆధారం లేకుండా నా క్లయింట్ ను రకరకాల ప్రశ్నలు అడుగుతున్నాడు. మీరు సారి నా క్లయింట్ ను ఎగ్జామిన్ చేయడానికి అనుమతి ఇవ్వ వలసిందిగా విన్న  వించు కుంటున్నాను..."

"అబ్జె క్షన్ " అన్నాడు సిబి లాయర్ రమేష్.

"నా క్లయింట్ మంచివాడని నిరూపించడానికి అవకాశం అడగడంలో తప్పేముంది..."

"అబ్జె క్షన్ ఓవర్ రూల్డ్..."

బోనులో ఉన్న విజయ్ దగ్గరకు వచ్చి ప్రశ్నించింది డిఫెన్స్ లాయర్ జ్యోతి.

"మీకు బినామీలు ఉన్నారా?

"లేరు".

"మీకు హాస్పిటల్స్, విద్యా సంస్థలు, వేల లారీలు ఉన్నాయని అందరూ అంటున్నారు. దానికి మీ సమాధానం."

"అవనీ అవాస్తవాలు. ఎవరో కావాలని పుట్టించిన పుకార్లు..."

"మీకు శత్రువులే మైనా ఉన్నారా?"

" అబ్జె క్షన్ యువరానర్! లాయర్ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు. విజయ్ కు సంబంధించిన హాస్పటల్స్, లారీలు, విద్యాలయాలు...అన్నీ'శ్రీ కృష్ణా' పేరుమీదే ఉన్నాయి. అంతేకాదు! విజయ్ కు చెందిన 'ఆస్తులన్నీ' ఒకే అడ్రస్ పేరులో ఉన్నాయి. ఫాతిక సంస్థల కు  చెందిన రిజి స్ట్రేషన్ లన్నీ 'శిరీష ఇండ స్ట్రీస్ ఉన్న అడ్రస్ మీదే' జరిగాయి...కావాలంటే సిబి సేకరించిన ఆధారాలు పరిశీలించండి..."

జడ్జ్ చేతికి ఫైల్ అందింది.

"అబ్జె క్షన్ యువరానర్! శ్రీ కృష్ణుడు కోటానుకోట్ల ప్రజల ఆరాధ్య దైవం. పేరుతో చాలా సంస్థలు ఉన్నాయి. లయార్ చెప్పేది వింటుంటే ఆశ్చర్యం కలుగుతోంది. దేశంలో ' శ్రీకృష్ణా ' పేరుమీద ఉండే ఆస్తులన్నీ నా క్లయింట్ వే అనే టట్లు ఉన్నాడు! నా క్లయింట్ ఇంతకు ముందే చెప్పినట్లు శిరీష ఇండ స్ట్రీస్ లో సాధారణ ఉద్యోగి! కంపెనీ అడ్రస్ మీ వివిధ సంస్థలు ఉంటే కంపెనీ యజమానిని అడగాలి. కంపెనీలో పనిచేసే ఉద్యోగులు  కంపనీకి సంబంధం లేకుండా  బయట చేసే ఉద్యోగాలకు కంపెనీ ఎటువంటి బాధ్యత వహించదు! సంబంధం లేని వాటిని నా క్లయింట్ కు అంట గట్టి, ముద్దాయిగా పేర్కొనడం భావ్యం కాదు. కేవలం ఊహాగానాలతో, అవాస్తవాల తో, మీడియా వార్తలతో కోర్టు వారిని నమ్మిస్తున్న లాయర్ పైన పరువు నష్టం దావా వేయాల్సి ఉంటుంది...."అంది డిఫెన్స్ లాయర్ జ్యోతి.

సిబి లాయర్ రమేష్ వైపు చూశాడు.

 "మిలార్డ్! నేను ఆధారాలు లేకుండా మాట్లాడలేదు. సిబి జెడి సేకరించిన ఆధారాలు నా దగ్గర చాలా ఉనాయి! హోటల్స్, హాస్పిటల్స్,విద్యాలయాల ప్రారంభో త్స వాల లో విజయ్  ఉన్న ఫోటోలు ఉన్నాయి. కృష్ణా నగర్ కాలనీ వాసులను ఉద్యోగాల్లో చేర్చుకోవాలని  శిరీష ఇండ స్ట్రీస్ కు , లారీ యజమానులకు విజయ్ రాసిన రాసిన రెకమెండేషన్ లెటర్లు ఉన్నాయి. వైద్యం కోసం వచ్చిన ఎంతోమంది కాలనీ వాసులకు, విద్యార్థులకు... సాయం చేయాలని  హాస్పిటల్స్ కు విద్యాలయాలకు రాసిన ఉత్తరాలున్నాయి...వాటన్నింటి మీద విజయ్ చేసిన సంతకాలు ఉన్నాయి.

  కావాలంటే పరిశీలించండి. ఇలా వైట్ కాలర్ నేరాలు చేసిన ముద్దాయిని కఠినంగా శిక్షించాలి. మరెవ్వరూ ఇటువంటి నేరాలకు పాల్పడకుండా చూడాలని కోర్టువారిని కోరుకుంటున్నాను..."

జ్యోతి వైపు చూశాడు లాయర్ రమేష్.ఆమె ముఖంలో ఆవేశం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. తరువాత సిబి జెడి ప్రకాష్ వైపు చూశాడు. అతని లో చిరునవ్వు కన్పించింది.

కోర్టులో సూది పడితే వినబడే టన్త నిశ్శబ్దం గా మారిపోయింది వాతావరణం.

కోర్టు సమయం అయిపోనట్లు 'బెల్' మ్రోగింది.

"కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను"అన్నాడు జడ్జ్.తరువాత డిఫెన్స్ లాయర్ జ్యోతి వైపుచూశాడు. "ఏమైనా ఉంటే రేపు కోర్టులో చెప్పు..."అన్నట్లుంది చూపు.

ఫైనల్ జడ్జ్ మెంట్ కోసమే కేసు మరుసటి రోజుకు వాయిదా వేశారనీ, తప్పకుండా వాళ్ళు కేసు ఓడి పోబోతున్నారని విజయ గర్వం తో నవ్వుకున్నాడు రమేష్.

జడ్జి తన సీట్లోనుండి లేచి వెళ్ళిపోయాడు.

సిబిఐ జెడి ప్రకాష్ పోలీసులతో కోర్టు బయటకు వచ్చాడు.

బయట ఉన్న జనసందోహం చూసి ఆశ్చర్య పోయాడు!

“ఏన్నో ఏళ్ళ తరబడి అణచివేతకు గురై ఉవ్వెత్తున లేచిన ఉద్యమాన్ని ప్రభుత్వం నిరంకుశత్వంతో అణచివేస్తున్న దృశ్యం లా ఉంది.”

అశేష జనవాహిని.

బారికేడ్ల ను ఏర్పాటు చేశారు పోలీసులు.

విద్యార్థులు, ఉద్యోగస్థులు, కృష్ణా నగర్ కాలనీ వాసులు, మద్దతు దారులు...పెద్ద సంఖ్యలో ఉన్నారు. "విజయ్ జిందాబాద్...విజయ్ ను విడుదల చేయాలి...విజయ్ మాదేవుడు.... విజయ్ నిర్దోషి..."లాంటి అరుపులతో కోర్టు ప్రాంగణమంతా హోరెత్తి పోయింది. జనాన్ని కంట్రోల్ చెయ్యలేక పోలీసులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం పారా మిలటరీ బలగాలను కూడా రంగంలోకి దింపింది!

విజయ్ ను అప్పటికప్పుడే చూడాలనే ధ్యేయంతో పట్టుదలగా ఉన్నారు!

పోలీసులు విజయ్ ను తరలించడానికి వ్యాన్ దగ్గరకు తీసుకెళ్ళారు.

విజయ్ చేతులు అలా పైకి ఊపాడు.

క్షణం కోసమే చూస్తున్నట్లు, బ్రతుకుతున్నట్లు జనం అరుపులు. కేకలు. ఈలలు. జిందాబాద్ ...లతో  ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది.

దృశ్యాన్ని చూసి సిబి జెడి తన ప్రక్కనే ఉన్న అనంత శర్మతో అన్నాడు.

"చూడు. అమాయక ప్రజలు. విజయ్ వాళ్లకు పప్పు బెల్లాలు పంచిపెట్టి వాళ్ళ ఆస్తులను దోచేశాడు. అయినా వాళ్ళ కళ్ళు మూసుకు పోయాయి. అవినీతి ఎంత వ్యవ స్థీకృత మై పోయింది. ప్రజలు ఎంత స్వార్ధ పరులు. అవినీతి వట వృక్షమై కళ్ళ ముందే అతని ఆస్తులు, వ్యాపారాలు కనబడుతున్నా, ఆధారాలతో చూపిస్తున్నా అతడ్నే కోరుకుంటున్నారు. ఆరాధిస్తున్నారు. ప్రేమిస్తున్నారు. అతని కోసమే జీవిస్తున్నట్లున్నారు..."

అవకాశం కోసమే ఎదురు చూస్తున్నట్లు లోకల్ ఎస్సై మాట్లాడాడు.

"ఇంకా అతను అవినీతి పరుడని కోర్టు ఫ్రూవ్ చేయలేదు కదా సర్!"

దెబ్బతిన్నట్లు అతని వైపు చూశాడు సిబి జెడి ప్రకాష్.

క్షణంలో తను సురేష్ ను అరెస్ట్ చేసినప్పుడు, సి.ఎం. గురించి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఒక పదునైన బాణం వచ్చి తన హృదయానికి గుచ్చు కున్నట్లు విలవిల్లాడి పోయాడు.

ఒకరు న్యాయాన్ని కాపాడడానికి అలా మాట్లాడితే మరొకరు అన్యాయానికి సపోర్ట్ చేస్తూ ఇలా మాట్లాడారు.

"ఇద్దరికీ ఎంత తేడా !"

*****

2 comments:

Anonymous said...

court scene is super

Sharth Bangalore said...

kevvukeka