Sunday, April 28, 2013

రూలర్ కథ -14


ఖాతా దారులకు ధనాన్ని రుణంగా తీసుకోవటం, ఇవ్వటం బ్యాంకు యొక్క ప్రధాన కార్య కలాపాలు.

ఖాతాదారుల చేత తక్కువ వడ్డీకి తీసుకుని అవసరమైన వారికి లోన్స్ ఇస్తూ వచ్చే రాబడి పై బ్రతికే సంస్థ. చెక్కులు, డ్రాప్ట్ లు , కమీషన్లు...పై వచ్చే ఆదాయం కంటే వడ్డీ మీద వచ్చే ఆదాయం ఎక్కువ !

కష్ట మర్లందరికీ ఒకేసారి డబ్బు అవసరం రాదు. విత్ డ్రా చెయ్యరు... అనే నమ్మకం మీద బ్యాంకులు పని చేస్తాయి. ఒకవేళ అలా జరిగితే బ్యాంకులు దివాలా తీస్తాయి. ఇది నిజం. వాస్తవం!

విజయ్ అదే 'ట్రిక్' ను ప్రయోగించాడు.

వివిధ బ్యాంకులలో వివిధ ప్రదేశాలలో విజయ్ బినామీలు డబ్బులను విత్ డ్రా చేశారు. బ్యాకులలో ఉన్న సొమ్మంతా వెళ్లాకే ఇచ్చేశారు! మిగిలిన ఖాతాదారులకు 'హెడ్ ఆఫీసు' నుండి తెచ్చి ఇస్తామన్నారు! అయితే అది భయం వలనో, కమ్యూని కేషన్ గ్యాప్ వలనో తెలియదు గానీ తెలిసిన వారికి తెలిసినట్టు చెప్పారు బ్యాంకులో డబ్బులేదని... అయిపోయిందని....

ఒకరినుండి మరొకరికి ' వార్త  ' రకరకాలుగా వెళుతోంది. విన్నవారు ఇంకొకరితో ఫలానా బ్యాంక్ లో డబ్బు ఖాళీ అన్నారు...అది విన్న వారు యూరప్ సంక్షోభం గురించి చెప్పి, బ్యాంకు లలో డబ్బు ఉంచడం శ్రేయస్కరం కాదన్నారు! దాన్ని విన్న వారు బ్యాంకులలో డబ్బు ఉంచవద్దని చెప్పారు. వార్తలు దావానలంలా వ్యాపించాయి. డానికి టెక్నాలజీ పెరిగింది.

సెల్ ఫోన్స్  బిజీ అయ్యాయి.


బ్యాంకు తన రుణాలను ఖాతాదారుల సొమ్మును చెల్లించ లేనపుడు దివాలా తీస్తుంది. అది రెండు రకాలు. ఒకటి స్వచ్చందంగా. రెండవది తప్పనిసరిగా. దాన్ని నిర్ణయించేది మాత్రం డైరెక్టర్లు.

బ్యాంకుల ముందు, .టి.యం  ముందు జనం బారులు తీరారు. పెట్రోలు ధర పెరుగుదల అనౌన్స్ చేసినప్పుడు పెట్రోల్ బ్యాంకుల దగ్గర ఉండే 'క్యూ' లా పెద్ద పెద్ద 'క్యూ'లు ఏర్పడ్డాయి.


.టి.యం లో డబ్బులు అయిపోయాయి. కలకలం రేగింది. అభద్రతా పెరిగింది. విచక్షణ కోల్పోయారు. దాడులకు దిగారు.

నిరంతరం సంచలన వార్తలకోసం పరితపించే లెక్కకు మించి ఉన్న వార్తా చానెళ్ళ కు 'పని' దొరికింది. విజృo భించారు. చూపించిన  దృశ్యాన్ని, ప్రదేశాన్ని మళ్ళీ మళ్ళీ చూపించి ప్రజలలో గందర గోళాన్ని, భయాన్ని పెంచారు.

క్షణాల్లో వార్త ప్రపంచం నలుమూలలా  వెళ్ళింది.

బ్యాంకులు సంక్షోభం బాట పడ్డాయి. దాని ప్రభావం మొదట స్టాక్ మార్కెట్లపై పడింది. బ్యాంక్ సూచీలు నష్టాలు చూపించాయి. దాని  ప్రభావం మిగతా వాటి పై పడి మార్కెట్లు భారీ ఒడిదుడుకులకు లోనయ్యాయి. పెద్ద పెద్ద ఇన్వెస్టర్ల సైతం ఖంగు తున్నారు! అమ్మకాలు జోరందుకున్నాయి. దీంతో బి ఎస్ సెన్సెక్స్ పన్నెండు వందల పాయింట్లు దిగువున ట్రేడ్ అవుతోంది. నిప్టీ 430 పాయింట్లు నష్టపోయింది.

సెన్సెక్స్ 6.17 శాతం, నిప్టీ 6.89 శాతం చొప్పున క్షీణించాయి. నష్టం సుమారు నాలుగు లక్షల కోట్లుగా అంచనా  వేశారు !

సి.ఎం. కార్యాలయంలో మంత్రులతో  ముఖ్యమంత్రి  అత్యవసరంగా భేటీ అయ్యారు. సమావేశానికి డిప్యూటీ సి ఎం , హోం మంత్రి, వివిధ శాఖ మంత్రులు సుమారు 20 మంది సమావేశానికి హాజరయ్యారు. సమీక్షా సమావేశానికి వివిధ ఇంటలిజెన్స్ విభాగాల అధిపతులు కూడా హాజరయ్యారు. వారిలో సిబి జెడి  ప్రకాష్ కూడా ఉన్నారు. రాష్ట్ర పరిస్థితి , విచారణ పురోగతి పై  చర్చించారు. సిబిఐ జెడి తన నివేదికను సమర్పించాడు.

"ఇలా జరగడానికి కారణం విజయ్. ఒకేసారి అన్ని బ్యాంకులలో డబ్బు విత్ డ్రా చేయించి, ఇలాంటి సంఘటనలకు ,పరిస్థితి కి కారణం అయ్యాడు. అతనికి బినామే ఆస్తులున్నాయి. మోసాలు చేస్తున్నాడు. ఆర్ధిక నేరాలు చేశాడు. వాటన్నింటికి ఆధారాలున్నాయి! అతడ్ని అలా వదిలేస్తే దేశ భవిషత్, భద్రత దెబ్బతింటాయి. .." నివేదకను మత్రిమండలి చర్చించింది. తాజా పరిణామాలను అధిష్టానానికి తెలియజేశారు.

అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

మంత్రులు మాట్లాడారు.

"ప్రజలకు ఏమీ భయం లేదు. మీ డబ్బులు ఎక్కడికీ వెళ్ళవు. ప్రభుత్వం గ్యారంటీ! కావాలని రూమర్లు  క్రియేట్  చేశారు. దోషుల్ని పట్టుకున్నాం. విచారిస్తున్నాం! త్వరలో అరెస్ట్ చేస్తాం...."

మంత్రులు ఎంత ధైర్యం చెప్పినా ప్రజలలో భయం తొలగలేదు.

మరికొన్ని గంటల్లోనే విజయ్ ను అరెస్ట్ చేయాలని సిబిఐ కి దేశాలు వచ్చాయి.  విజయ్ ను అరెస్ట్ చేసేందుకు సిద్దమైంది.

ప్రాధమికంగా బ్యాంకులనుండి బినామీలతో డబ్బు విత్ డ్రా చేయించి ప్రజల్ని భయాందోళన లకు గురిచేశాడని  అభియోగాలు మోపింది. అతని సిబిఐ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. భారతీయ శిక్షాస్మృతి  సెక్షన్ 120 బి , రెడ్ విత్ 420,471, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(2) రెడ్ విత్ 13(1) సి క్రింద కేసులు నమోదు చేసింది.

విజయ్ ను సిబిఐ అరెస్ట్ చేసింది. కోర్టుకు తరలించింది. కోర్టు 14 రోజులు జుడీషియల్ రిమాండ్ విధించింది.

విజయ్ అరెస్ట్  వార్త దావానలంలా వ్యాపించింది.

విజయ్ అరెస్ట్ వార్త తెలిసినవెంటనే విజయ్ మద్దతు దారులు రెచ్చి పోయారు.

విజయ నడుపుతున్న స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించారు విద్యార్థులు రోడ్డెక్కారు . హాస్పిటల్స్ మూసేయించారు. రోగులు అవస్థలు పడ్డారు. ఫ్యాక్టరీ మూసేసి ఉద్యోగులు, కార్మికులు ధర్నాలు చేసారు. లారీలు ఎక్కడిక్కడే ఆపేసి ధర్నా చేస్తున్నారు.

ధర్నాలతో కృష్ణా నగర్ కాలనీ వాసులు షాపులు మూసేయించారు. టైర్లు తగులబెట్టారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. అప్పటికే 'కొన్ని సంఘాలు ' మద్దతు తెలిపాయి. కొంతమంది సంఘీభావం ప్రకటించారు.


విజయ్ ను వెంటనే విడుదల చేయాలి. ఆయన ప్రజల పాలిట దేవుడు. అతడికి ఏమైనా జరిగితే , ఆతరువాత జరిగే వాటికి ప్రభుత్వమే భాద్యత వహించాల్సి వస్తుంది...వెంటనే అతడ్ని విడుదల చేయా లంటూ రాస్తారోకో లు చేశారు. టీవీ లలో అసలు వార్తలకు , పెయిడ్ వార్తలకు తేడా లేకుండా వార్తలొస్తున్నాయి.

విజయ్ అరెస్ట్ వార్త ఒక సంచలనం అయ్యింది.

కృష్ణా నగర్ కాలనీ లో తమ దేవుడు ఇక లేడని తనువు చాలించారన్న వార్తలు గుప్పుమన్నాయి....కాలనీలో సహజ మరణాలన్నీ కూడా ఆత్మలయ్యాయి!

విజయ్ కోసం ఆత్మహత్యలు అంటూ వార్తలొచ్చాయి.

ఒకటి, రెండు, మూడు... అంటూ చానెళ్ళ వారు  చావు రాజకీయాలు మొదలెట్టారు. కాలనీ లో అక్కడక్కడా విగ్రహాలు కూడా మొలుస్తున్నాయి”.

విజయ్ పాపులారిటీ అంతకంతకు పెరిగిపోతోంది.

విజయ్ కేసు కోర్టులో కొద్ది రోజుల్లోనే ప్రారంభం అయ్యింది.

*****

2 comments:

Aruna Anakapalli said...

super story

Bellamkonda Naresh said...

idi Balayya cinemaa story laa undi