Sunday, April 28, 2013

రూలర్ కథ -12


సమయం రాత్రి పది గంటలు.

ఐదు నక్షత్రాల హోటల్ దగ్గరకు సి బి జె డి ప్రకాష్ పోలీసులతో వెళ్ళాడు.

పోలీసులను చూడగానే హోటల్ సిబ్బంది కంగారు పడ్డారు. జరగరానిది ఏదో జరగబోతున్నదని గ్రహించారు. వాళ్ళ మనసు కీడును శంకించింది. టెక్నాలజీ పెరిగింది. ప్రతి ఒక్కరిదగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి. వెంటనే తమకు తెలిసిన 'పెద్ద పెద్ద' వాళ్లకు ఇన్ఫ ర్మే షన్ చేర వేశారు! వాళ్ళలో లోకల్ ఎస్సై కూడా ఉన్నాడు.

ఏరియా ఎస్సై కి హోటల్ కి సంబంధం ఉందని తెలిసి ఎస్సైకి సమాచారం ఇవ్వలేదు ప్రకాష్!

పోలీసులు చక చకా తనికీకి వెళ్ళారు. కొందరు డైరెక్ట్ గా సి.ఎం. కొడుకు ఉన్న రూం కు వెళ్ళారు. పక్కా సమాచారంతో వచ్చారు కాబట్టి డైరెక్ట్ గా వెళ్లి తలుపు తట్టారు!

పోలీసులు సురేష్ ను లాక్కొస్తున్నారు. అతను గింజు కుంటున్నాడు. అప్పుడప్పుడు రెచ్చి పోతున్నాడు. "నేనెవరో తెలుసా! సి.ఎం. కొడుకు. నాతో పెట్టుకుంటే  ఎం జరుగుతుందో తెలుసా..."అని హెచ్చరిస్తున్నాడు. అయినా పోలీసులు భయపడలేదు. ఈడ్చు కొస్తున్నారు. అతని వెనకాలే గదిలో దొరికిన అమ్మాయిలూ కూడా వస్తున్నారు. వాళ్ళు ముఖాన్ని  చెంగుతో కప్పుకుని ఉన్నారు. మిగతా గదుల్లో దొరికిన విటులను కూడా పోలీసులు తీసుకొస్తున్నారు.

అప్పటికే అక్కడకు చేరుకున్న విలేకర్ల కెమరాలు 'క్లిక్'మన్నాయి. సరిగ్గా అప్పుడు అక్కడికి లోకల్ ఎస్సై వచ్చాడు. సిబి జెడి ప్రకాష్ ను చూడగానే అతని గుండె ఝల్లు మంది. అయినా తనకు 'పెద్ద'వాళ్ళ సపోర్ట్ ఉందన్న ధైర్యంతో ప్రకాష్ దగ్గరకు వెళ్ళాడు.

పోలీసులు సురేష్ ను జీప్ ఎక్కించారు.

ఎస్సై ప్రకాష్ తో అన్నాడు. "అతనెవరో తెలుసా! సి. ఎం. కొడుకు..."

"అయితే..."

"సి.ఎం. గురించి మీకు తెలియదు అతను తలచుకుంటే..."అని అర్దోక్తి గా ఆపుచేసి, భయపెట్టాడు.

"నాకేం భయం లేదు" అని వెళ్లి వెహికల్లో కూర్చున్నాడు.

చివరగా ప్రయత్నించాడు ఎస్సై.

"సి.ఎం.గురించి మీకు చాలా విషయాలు తెలియదు. అతను ఫ్యాక్షనిస్ట్. అతనిపై డజనుకు పైగా మర్డర్  కేసులు ఉన్నాయి... "

"ఇంకా ప్రూవ్ కాలేదు కదా!"

ఊహించని సమాధానం ప్రకాష్ నోటివెంట వెలువడగానే నిర్ఘాంత పోయాడు ఎస్సై.

జీప్ వెళ్ళిపోయింది.

*****

కోపంతో విజయ్ చాంబర్ లోకి అడుగు పెట్టింది శిరీష.

చేతిలో ఉన్న న్యూస్ పేపర్ విసిరికొట్టింది. అది సరాసరి వెళ్లి విజయ్ మీద పడింది.

ముంచుకొచ్చిన కోపాన్ని అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుని శిరీష వైపు చూశాడు.

"చూడు. న్యూస్ పేపర్ చూడు. ముఖ్య మంత్రి గదిలో దొరికిన అమ్మాయిలూ నీ కాలేజ్ స్టూడెంట్స్".

అతను అర్ధం కానట్లు చూశాడు.

"నీవిలాంటి నీచ మైన పనులు చేస్తావనుకోలేదు. అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నావని తెలుసు. కానీ ఇలా దిగ జారి బ్రతుకుతావను కోలేదు. నీ కాలేజ్ లో ఉన్న వాళ్ళు నీ బిడ్డలతో సమానం. ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు హాస్టల్లో చేర్పిస్తే వాళ్ళను మోసం చేసి, వాళ్ళ శరీరాలతో డబ్బులు సంపాదిస్తావా! డబ్బు కోసం ఏమైనా చేస్తావా. రేపెప్పుడైనా అవసరం అయితే నీ భార్యను కూడా 'చేతులు' మర్చుతావా..."అంటున్న ఆమె మాటలకు కోపంతో చైర్ లో నుండి విసురుగా లేచాడు.

"నోర్ముయ్!"

అన్నాడు. అప్రయత్నంగా చేయి ఎత్తాడు. ఎత్తిన చేతిని అలాగే గాల్లోనే ఆపేసి, కంట్రోల్ చేసుకున్నాడు.

ఊహించని పరిణామాలకు ఒక్క క్షణం బిత్తర పోయింది. క్షణం సేపే వెంటనే తేరుకుంది. అంత పెద్ద మాటలు అనకూడని అంతరాత్మ హెచ్చ రిస్తున్నా లెక్క చేయకుండా మాట్లాడింది.

"ఇంతవరకు నీమీద ఉన్న గౌరవం పోయింది! నన్ను కొట్టేంత తప్పు  నేనేం చేశాను. అన్యాయాన్ని ఎదురించినందుకా..."నిలదీసింది.

ఆమెకు ఏడుపొచ్చింది. ఏడ్చింది. గట్టిగా ఏడ్చేసింది.

ఎప్పుడూ చూడని ఆమె కల్లో నీళ్ళు చూసి చలించిపోయాడు. "సారీ శిరీషా..." అని ఏదో చెప్పా బోయాడు. అంత లో అక్కడికి సి బి జె డి ప్రకాష్ వచ్చాడు. అతడు ఎంటర్ అవగానే తన తడి కళ్ళ ను అతడు చూడకుండా అటువైపు తిరుగుకుంది శిరీష.

"విజయ్! పబ్లిక్, ప్రెస్ వాళ్ళు కాలేజ్ మీదని ప్రచారం చేస్తున్నారు! మిమ్మల్ని అరెస్ట్ చెయ్యాలని మహిళా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. కాలేజ్ మీది కాదని ఎన్ని చెప్పినా విన్పించుకోలేదు. మేం ప్రయత్నించాం. విఫలమయ్యాం. మీ దగ్గ సంతకం తీసుకుని, అఫిషియల్ గా వాళ్లకు తెలియజేస్తాం. ఇక్కడ సంతకం పెట్టండి...ప్లీజ్!" అని కాగితం అందించాడు.

విజయ్ సంతకం చేశాడు.

పేపర్ తీసుకుని పరిశీలనగా  చూశాడు సి బి ఆఫీసర్.

"ఏం సర్! సంతకాలు సరిపోలేదా!"

ఉప్పెనలా వచ్చిన తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు.

"నీ లాంటి క్రిమినల్స్ ను ఇంత వరకు నా సర్వీసులో చూడలేదు. నీ లాంటి 'వైట్ కాలర్' నేరగాడ్ని అంత సులువుగా వదిలిపెట్టను. ఏదో ఒక రోజు దొరుకుతావు. రోజు నిన్ను కాపాడుకోవడానికి ఎవ్వరూ రారు. చివరకు 'నీవాళ్ళు'కూడా..." అని అక్కడ్నుంచి పెద్ద పెద్ద అడుగులతో వెళ్లి పోయాడు.

తరువాత శిరీష కూడా వెళ్ళడానికి రెండడుగులు వేసింది.

ఆమె చేయి పట్టుకుని ఆపాడు.

"నన్ను క్షమించ శిరీష! నేను తప్పు చెయ్యలేదు. నాకూ దానికీ సంబంధం లేదు. వెంటనే కాలేజ్ ప్రిన్సిపాల్ ను పిలిచి విషయం కనుక్కుంటాను. అతడ్ని సస్పెండ్ చేస్తాను..."

"ఎందుకు విజయ్ నన్నిలా ఏడిపిస్తున్నావ్! మోసం చేస్తున్నావ్. నువ్వు మంచిగా మారాలని నేను చేయని పూజ లేదు. మ్రొక్కని దేవుడు లేడు! అయినా నీవు మారలేదు. కాలేజ్ నీది కాదా? నీ బినామీ సంస్థలో తప్పు జరిగితే నీది కాదా? అలా అనుకునివుంటే రాముడు రాజ్యం లో ఎవరో అన్న మాటలకు బాద్యత ఎందుకు వహిస్తాడు. రాజ్యం లో ఎవరు తప్పు చేసినా తనదే బాధ్యత అని రాముడు పరిపాలించిన రాజ్యం మనది. అలాంటిది  నీ బినామీ సంస్థలో జరిగిన నేరానికి బాధ్యత వహించావా?పైగా రాజకీయ నాయకుడిలా అతడ్ని సస్పెండ్ చేస్తానంటావా? ఎంత స్వార్ధం. ఇకచాలు. నీప్రేమా వద్దూ, నువ్వూ వద్దు. నువ్వు చేస్తున్న తప్పులు గుర్తుకు వచ్చినప్పుడల్లా నరకం అనుభవిస్తున్నాను...ఇకనాకు ఓపిక  లేదు. నిన్నూ, నీ తప్పులను భరించే శక్తీ లేదు."

"శిరీషా! ప్రస్తుతం నీవు ఎన్ని చెప్పినా వినే పరిస్థితి లో లేవు. అయినా ఒక్కమాట. నాకు నెల రోజులు టైం ఇవ్వు. నేనెలాంటి వాడినో, నా ఆశయం ఏమిటో తెలుస్తుంది. నేనెందుకు ఇలా ఉండానో తెలుస్తుంది. సరిగ్గా ముప్ఫయి రోజులు సమయం ఇవ్వు... తరువాత నీ నిర్ణయం నీవు తీసుకో!"

ఆమె సమాధానమేమీ చెప్పకుండా అక్కడనుంచి  వెళ్ళిపోయింది.

శిరీష అలా వెళ్ళగానే సెక్రటరీని పిలిచాడు. గదిలోకి అడుగు పెట్టగానే చెప్పాడు.

"కల్పనా! త్వరలో నా జీవితాశయం నెరవేరబోతోంది. దానికి చాలా డబ్బులు అవసరం. మన దగ్గర నమ్మకంగా పనిచేసే 116 మంది బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బు కావాలి! వాళ్ళతో విడివిడిగా వివిధ బ్యాంకులలో , వివిధ ప్రదేశాలలో ఉన్న సొమ్మును విత్ డ్రా చేయించు. డబ్బు ముందు నా పర్సనల్ గదిలో ఉన్న లాకర్లలో పెట్టేటట్లు ఏర్పాటు చెయ్యి. తరువాత ఎక్కడ పెట్టాలో తెలియజేస్తాను..."

సరేనంది. వెళ్ళడానికి ప్రయత్నిచింది.

"ఒక్క నిమిషం ఆగు. పని సీక్రెట్ గా జరగాలి. ఒకరికి తెలియకుండా మరొకరికి చెప్పు...అంతా రహస్యం."

"ఎందుకూ?" అని అడగబోయి, కంట్రోల్  చేసుకుంది. అక్కడ్నుచి వెళ్ళిపోయింది. ఆమె అలా వెళ్ళగానే విజయ్ ట్రాన్స్ పోర్ట్ కంపెనీ  కి,విద్యా సంస్థల ఇంచార్జ్ లకు , హాస్పిటల్ మేనేజ్ మెంట్ కు ఫోన్ చేశాడు. డబ్బంతా విత్ డ్రా  చేయమని చెప్పాడు.

ఒకరి కితెలియకుండా మరొకరు కోట్లకొద్దీ డబ్బులను రహస్య ప్రదేశానికి తరలిస్తున్నారు.విజయ్ ప్లాన్స్ తెలియకుండా కోటానుకోట్లు బ్యాంకులనుండి ఒకేసారి విత్ డ్రా చేశారు.

******

2 comments:

Kalepalli Eswar said...

Nice story

ravichandran said...

good story