Sunday, April 28, 2013

రూలర్ కథ-11


సెల్ ఫోన్ మ్రోగింది.

నెంబర్ చూ సి, "హలో...శిరీషా!" అన్నాడు.

"మీతో గంట సేపు పని ఉంది. నాతో రావాలి".

"ఎప్పుడు"

"ఇప్పుడే !"

"ఇప్పుడేనా..." సందేహం గా అని, వెళ్లక పోతే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో నని భయపడి వెంటనే "సరే. ఎక్కడికి రావాలి?" అని అడిగాడు.

"కార్లో వస్తున్నాను. కంపెనీ ముందున్న మెయిన్ రోడ్డు మీదకు రండి. పదే పది నిమిషాల్లో వచ్చేస్తాను.రెడీ గా ఉండండి".

సరేనన్నాడు.

అతను వెళ్లి కారు కోసం వెయిట్ చేశాడు. శిరీష కారు వచ్చి ఆగింది. కారు డోర్ తెరిచింది. విజయ్ కూర్చున్నాడు.

కారు ముందుకు వెళుతోంది.

అలా కొద్ది దూరం వెళ్లేసరికి గతుకుల రోడ్డు వచ్చింది. కారు ఎగిరెగిరి పడుతోంది. అయినా ఆమె స్పీడ్ ఆపలేదు.

" ఎక్కడికీ?" టెన్షన్ తట్టుకోలేక అడిగాడు.

"చెబితేగానీ రావా!"చిరు కోపంగా అంది.

మౌనంగా ఉండిపోయాడు. ఇక  మాట్లాడితే  కష్టమను కున్నాడు. వాళ్ళిద్దరి మద్య మౌనమే రాజ్యం చేసింది.

" ఏరియా నాకు బాగా తెలుసు. ఎక్కడికెల్లాలో చెబితే 'షార్ట్ కట్స్' లో వెళ్ళొచ్చు..." అర్దోక్తిగా ఆపుచేశాడు.

"షార్ట్ కట్స్ లో సంపాదించడం, మోసగించడం తమకు అలవాటే కదా!"

"మాటి మాటికీ నన్ను మాటలతో హింసిస్తున్నావు! నన్ను తిట్టినా తరువాత కూడా కొంచెం కూడా నాపై జాలి కలుగదా!"

"అలా అలోచిన్చాబట్టే మళ్ళీ మళ్ళీ నిన్ను కలుస్తున్నాను. మాట్లాడుతున్నాను. లేకపోతే నీ బుద్దులు చూసి ఎప్పుడో తప్పుకునేదాన్ని!"

"మన 'ప్రేమ' అంత గొప్పది! దాన్ని మన మనసులు ఎప్పుడో గట్టిగా పెనవేసు కున్నాయి. ఇక దాన్ని విడదీయటం మన చేతుల్లో లేదు...!"

" 'కోరికే' నన్ను ఇంకా బ్రతికిస్తోంది. నువ్వు మారుతావనే మిగిలింది! రోజు నేను చూపించ బోయే దృశ్యా ల్ని చూసి, కాస్తయినా మారుతావనే ఆశ తో న్నాను."

"అంటే నాకు గీతో దేశం చేయడానికి తీసుకెలు తున్నావ న్నమాట!"  ఆశ్చర్యంగా అన్నాడు.

సడెన్  బ్రేక్ తో కారు ఆపేసింది.

తన మాటలకు కారు ఆపిందని అనుకున్నాడు మొదట్లో. కానీ ఆమె రావలసిన చోటు వచ్చేసిందని కారు ఆపిం దని గ్రహించాడు తరువాత.

కారు దిగింది. అతను కూడా దిగాడు.

చుట్టూ స్లమ్ ఏరియా.

కృష్ణా నగర్ కా లనీ!

పేదవాళ్ళు నివసించే ప్రాంతం. గుక్కెడు మంచినీటి కోసం బారులు తీరి, పోట్లాడుకునే ప్రదేశం. కరెంట్ లేని ఏరియా. డ్రై  నేజీ అస్త వ్యస్తం తో, కంపుతో నిండిన మురికి వాడ. 'ఇక్కడికెందుకు వచ్చిందబ్బా!'అనుకున్నాడు.

శిరీష చెప్పింది.

"అటుచూడు విజయ్! ఇక్కడ నివసించేవారి బ్రతుకులు ఎంత దుర్భరంగా ఉంటాయో తెలుసా! వందరూపాయలు దొరికితే రెండు పూటలకు సరిపడా బియ్యం,కూరల తో బ్రతికే కుటుంబాలే ఎక్కువ. డబ్బంటే నీలాంటి వాళ్లకు లెక్కే లేదు. కానీ వీరికి నిత్యావసరం. పాల ప్యాకేట్లూ, బ్రెడ్ ముక్కలు కొనలేక అర్ధాకలితో బ్రతికే కుతుబాలెన్నో ఉన్నాయి. తిండి లేక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. ఇకనైనా డబ్బు పిచ్చి వదులుకో . సంపాదించిన దానితో తృప్తి పడు. కొంతైనా పేదలకు పంచిపెట్టు. నీతిగా బ్రతుకు. డబ్బు ముఖ్యం కాదు. మానవత్వం ముఖ్యం..."

ఆమె మాటలకు దెబ్బతిన్నట్లు చూశాడు.

అంతలో అక్కడ విజయ్ ను చూసిన వారు చూసినట్లు అరిచారు. "సారొచ్చారు...విజయ్ సారొచ్చారు".

"దండం సర్, నమస్తే దొర...వందనం అయ్యా..."వచ్చిన వాళ్ళు వచ్చినట్లు పలకరించారు. ఆప్యాయత చూపారు. మ్రొక్కారు. అరిచారు. కేరింతలు కొట్టారు. చుట్టు ముట్టారు.

వాళ్ళ వేపు చిత్రంగా చూస్తుండిపోయింది.ఆమె మైండ్ బ్లాంక్ అయిపొయింది.

రాన్రాను జనాలు ఎక్కువయ్యారు. కాలనీ, కాలనీ గా వస్తున్నారు. విజయ్ ను చుట్టు ముట్టారు. పెద్ద సంఖ్య లో గుమికూడారు. ఆడా, మగ తేడాలేకుండా ఇసుక వేస్తె రాలనంత జనం వచ్చారు. ప్రాంతమంతా హర్ష ద్వానాలతో మారు మ్రోగింది.

శిరీషను జనం నెట్టివేశారు.

అతడ్ని జనం నెత్తిన పెట్టుకున్నారు. ఎలక్షన్లలో గెలిచినా అభ్యర్థిని ఊరేగించి నట్లు ఊరేగిస్తున్నారు.  జాతరలో దేవుడ్ని మోసినట్లు మోస్తున్నారు. అతడు వాళ్ళ తలల పైన , చేతుల పైన ఉన్నాడు!

విజయ్ ను చూసింది. అందనంత ఎత్తులో దేవుడిలా ఉన్నాడు.

అక్కడే వున్నా ముసలావిడను పిలిచి 'ఎవరతను?' అని అడిగింది తెలియనట్లు శిరీష.

"మా దేవుడు! "

అర్థం కానట్లు ముసలావిడ వైపు చూసింది.  "దేవుడా...?" ఆశ్చర్యంగా అంది.

"అవునమ్మా అతను మా పాలిత దేవుడు. మా పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నాడు. హాస్పటల్ కట్టించాడు. ఇక్కడున్న ప్రతి ఒక్క కుటుంబానికి ఉద్యోగాలిచ్చాడు. లారీ డ్రైవర్లుగా ఉన్నారు. కాలనీలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఆయన మూలంగా ఎంతో కొంత మేలు జరిగింది. ఆయన ఎవరోకాదు... మమ్మల్ని కాపాడడానికి పుట్టిని కృష్ణ పరమాత్మే!"

ముసలావిడతో అంది. అతను ప్రభుత్వం ఇచ్చే స్కాలర్ షిప్పుల తో స్కూలు నడుపుతున్నాడు. పేదలకు వైద్యం అని చెప్పి విదేశాలనుండి డబ్బులు దోచేస్తున్నాడు...అసలు అతను మీకు సరియైన జీతాలు ఇవ్వకుండా మీ పొట్టలు కొడుతున్నాడు...మీ డబ్బులు తినేస్తున్నాడు".

అంతే అక్కడ జనం చేరారు. శిరీష మాటలకు జనం అడ్డు తగిలారు.

"తింటే తిననీ! మాకు కాసింత గంజి పోస్తున్నాడు అది చాలు. మాత్రం సహాయం చేసే వాళ్ళు కూడా మాకు లేదు! మాకు పిలిస్తే పలికే దేవుడు అతను. అతని గురిచి ఇంకొక్క మాట మాట్లాడితే ప్రాణాలతో ఇక్కడనుండి వెళ్ళలేవు..."

వాళ్ళ మాటలకు శిరీష కొద్ది గా భయపడింది. సైలెంట్ అయి పోయింది.

"విజయ్ నీ తెలివి తేటలు అద్భుతం. వాళ్ళ డబ్బుతో వ్యాపారం చేస్తూ వాళ్ళ చేత దేవుడనిపించు కుంటున్నావు. ఎంత దుర్మార్గుడవు? ప్రజలకు పప్పు బెల్లాలు పంచిపెట్టి వాళ్ళను నీ వైపు తిప్పుకున్నావు.వీళ్ళు చాలా అమాయకులు. నిన్ను నమ్మారు. నీ స్వార్ధానికి వీళ్ళను బలి చేయకు" అనుకుంది. వెంటనే దేవుడ్ని ప్రార్ధించింది.

"అమాయకులైన వీళ్ళకు  విజయ్ వలన ప్రమాదం రాకుండా చూడు స్వామీ!"

3 comments:

Anonymous said...

Nice film story. Super duper Hit.

Vijayanad Amalaapuram said...

story super

Kavya Suryarao pet,Vijayawada said...

Is it Balayya film story