Sunday, April 28, 2013

రూలర్ కథ -10


సిబిఐ జెడి ప్రకాష్ చాంబర్ లోకి అడుగు పెట్టాడు సి బి ఇనస్పెక్టర్ అనంత శర్మ.

ఏదో రాసుకుంటున్నప్రకాష్ ఆగి, అనంత శర్మ వైపు చూశాడు.

తన పైల్ మీద సంతకం కోసం వచ్చాడు. అలా ముందుకు వంగి పైల్ అందించాడు. పైల్ తీసుకుంటూ అనంత శర్మ వైపు చూశాడు.

చెంప వాచిపోయి ఉంది. దాన్ని చూశాడు.

"ఏమైంది... చెంప ఎందుకలా ఉంది?" తెలుసుకోవాలని అడిగాడు.

ఆతరువాత పరిశీలనగా చూశాడు. చేతి వ్రేళ్ళ గుర్తున్నాయి. ఎవరో కొట్టినట్లు ఉన్నారు అనుకున్నాడు.

"ఏం..ఏంలేదు!" అన్నాడు తడబడుతూ.

"పర్లేదు చెప్పు. పర్సనల్ అయితే వద్దు. జస్ట్ తెలుసుకోవాలని అడుగు తున్నాను".

అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న దుఃఖాన్ని ఆపుకో లేక ఏడుస్తూ చెప్పాడు.

"ముఖ్యమంత్రి కొడుకు సురేష్ కొట్టాడు".

"వ్వాట్! సురేష్ కొట్టాడా? ఎందుకు?"

ముఖ్యమంత్రి కొడుకు సరదాలకు  అంతులేదు ! అతను స్నేహితుల తో కల్సి జల్సా చేస్తుంటాడు! ఖరీదైన బైక్ లలో ఊరంతా బలాదూర్ తిరుగుతుంటాడు. కొన్ని  కంపెనీల  బైక్ లు ఫాతిక   లక్షల కంటే ఎక్కవే! అలాంటి బైక్ పైన  చేత్తో బీర్ బాటిల్ తాగుతూ, మరో చేత్తో డ్రైవింగ్ చేస్తూ ఫ్రెండ్స్ తో కల్సి వస్తున్నాడు సురేష్. అలా కొద్ది దూరం రాగానే బాటిల్ ఖాళీ అయ్యింది. చేతిలో ఉన్న బాటిల్ ను దూరంగా విసిరి వేశాడు. మద్యం మత్తులో ఉన్నాడు. తల పొగరు. దారిలో ఉన్న అమ్మాయిల దగ్గరకు బైక్ పోనిచ్చి సడెన్ గా  హారన్  కొట్టేవాడు.వాళ్ళు ఉలిక్కి పడేవారు. దాన్ని చూసి థ్రిల్లయ్యె  వాడు .వాడి శాడిజం మూలంగా చాలా మంది భయపడేవారు. అలా వాడు శాడిస్టిక్ ఆనందం పొందేవాడు.

నా భార్య కూతురుతో కల్సి గుడికి వెళ్లి తిరిగి వస్తున్నాం. రోడ్డుపైన నేనూ నా భార్య ముందు నడుస్తున్నాం. వెనకాలే మా అమ్మాయి వస్తోంది. అమ్మాయి చేతిలో పూజ తట్ట వుంది.

సురేష్ అలా బైక్ మీద వస్తూ మా అమ్మాయి నడుం క్రింది భాగాన 'టచ్' చేశాడు. మా అమ్మాయి కోపంతో 'ఇడియట్!' అంది.

అత ను సడెన్ బ్రేక్ తో బైక్ ఆపాడు. రివర్స్ చేసి మా అమ్మాయి దగ్గర కు  వచ్చాడు. అతని వెనకాలే అతని ఫ్రెండ్స్ ఉన్నారు. దాంతో అతను మరింత రెచ్చిపోయాడు!

"ఏయ్! ఏంటే అన్నావ్" అన్నాడు మా అమ్మాయితో.

"నా కోపం కట్టలు తెంచుకుంది. ఆవేశం తో అతని షార్ట్ పట్టుకున్నాను. సి బి  ఇనస్పెక్టర్ కూతుర్నే అల్లరి చేస్తావా?" అన్నాను కోపంగా.

అతడు షేం గా ఫీల్ అయ్యాడు.

బైక్ నుండి అలా జంప్ చేశాడు. 'ఫట్' మని నా చెంప పగుల కొట్టాడు. "నువ్వు ఆప్ట్రాల్ సి బి ఇనస్పెక్టర్. నేనెవరో తెలుసా..! సి. ఎం. కొడుకు."

అంతే భయం వేసింది నాకు. వెంటనే కొద్ది దూరం జరిగాను. అంతలో అక్కడికి జనం చేరారు. ఎవరో మొబైల్ తీశారు.అతని ఫ్రెండ్స్ బలవంతంగా అతడ్ని బ్రతిమాలుతూ పిలుచుకెల్లారు..."

"అతని పై పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా?"

"లేద్సార్'.

"ఎందుకూ?"

"అంత పెద్ద వాళ్ళతో గొడవ మనకెందుకు సర్!".

"వ్వాట్! ఒక సి బి ఇనస్పెక్టర్ ఇలా మాట్లాడితే ఇక సామాన్యుల పరిస్థితి ఏమి?"

"అందంతా నాకు తెలియదు సర్. పోలీసులై నంత మాత్రాన మనం రాగ ద్వేషాలకు అతీతులం కాదు. మనకూ భార్యా పిల్లలు ఉన్నారు. బ్రతకాలి..."

"అయితే తప్పు చేసిన వాళ్ళను వదిలేద్దామా!".

వారిపైన పోరాడి మనమేం సాధిస్తాం. అనవసరమైన పంతాలకు పోయి ఉద్యోగాలు పోగొట్టు కోవడం కంటే ఇలా ఉండటం  మేలు...”

"అంటే..." అని ఏదో చెప్ప బోతున్న విజయ్ సెల్ మ్రోగింది.

"హలో..."అన్నాడు.

"హలో... నేను మీ భార్యను మాట్లాడుతున్నాను ".

"శ్రీ కళ్యాణీ! నేను కొద్ది బిజీగా ఉన్నాను. తరువాత..."అతని మాటలు పూర్తి కాకుండానే ఆమె అడ్డు తగిలింది.

"ఏవండీ! మన బాబును ఎవరో కిడ్నాప్ చేశారు" అంది ఏడుపుతో.

" కిడ్నాప్ చేశారా... ..ఎవరు...?"

"తెలియదు. పనిమనిషి రంగయ్యతో ఐస్ క్రీమ్ కావాలని షాప్ కు వెళ్ళాడు. షాప్ దగ్గర ఎవరో కార్లో వచ్చి తీసుకెళ్ళారు..."

"ఎవరైనా ఫోన్ చేశారా?"

"లేదు".

"సరే. కంగారుపడకు. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను..."అంటూ చక చక బయలుదేరి ఇంటికెళ్ళాడు.

శ్రీక ళ్యాని ఫోనులో మాట్లాడుతోంది. అక్కడే ప్రక్కన రంగయ్య నిలబడి ఉన్నాడు. అతని ముఖం దిగులుతో ఉంది.

ప్రకాష్ ను చూడగానే బోరున విలపించింది. "మన అబ్బాయిని విజయ్ మనుషులు కిడ్నాప్ చేశారట! అతని మీద మీరు తయారు చేసిన ఫైల్ ను అతనికి ఇస్తే వదిలి పెడతారంట. అంతేకాదు. అతనిపై ఎటువంటి యాక్షన్ తీసుకున్నా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు..."

అప్పుడర్థం అయ్యింది అతనికి ఎవరు కిడ్నాప్ చేశారో!

" ఫైల్ అతనికి ఇచ్చేసి, మన బిడ్డను తీసుకోచ్చేయండి..."

"వ్వాట్! నేను రాత్రీ పగలు కస్టపడి, సాక్షాధారాలతో తయారుచేసిన ఫైల్ ఇచ్చెయ్యాలా...మన స్వార్ధం కోసం నా సిన్సియారిటీ కోల్పోవాలా?"

"అదంతా నాకు తెలియదు. నాకు నా బిడ్డ ముఖ్యం. మీరేం చేస్తారో నాకు తెలియదు. వాడికేమైనా జరగరానిది జరిగితే నేను తట్టుకోలేను. ప్రాణాలతో ఉండలేను..."

విజయ్ ఆలోచిస్తున్నాడు. "ఆఫీసులో అతను అధికారానికి భయపడి కేసు పెట్టనన్నాడు. ఇప్పుడు ఈమె రౌడీలకు భయపడి ఫైల్ ఇచ్చెయ్యమం టో oది. ఎటుపోతోంది నాదేశం..."


అంతలో అక్కడికి బాబు ని తీసుకుని విజయ్ వచ్చాడు.

శ్రీ కల్యాణి ని చూడగానే విజయ్ నుండి  క్రిందకు దిగి తల్లి దగ్గరకు వెళ్ళాడు. వాడ్ని ఎత్తుకుని ముద్దుల వర్షం కురిపించింది ఆమె. తడి కళ్ళతో కృతజ్ఞతతో విజయ్ వైపు చూసింది. తల్లి ప్రేమను గుర్తించాడు.

తరువాత ప్రకాష్ వైపు తిరిగి అన్నాడు."నమస్తే సర్ నాపేరు విజయ్."

"తెలుసు. ఫోటోలో చూశాను" అన్నాడు సిబి జెడి ప్రకాష్.

ఆమె విస్తుపోయి చూసింది. అతడ్ని, తన భర్తను మార్చి  మార్చి  చూసింది.

"సారీ సర్. తెలియక జరిగిపోయింది. మా వాళ్ళు విషయం చెప్పగానే వాళ్ళను తిట్టాను. ముందే తెలిసి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. క్షమించండి".

"అంటే ఇది నీకు తెలియకుండా జరిగిందంటావు. నన్ను నమ్మ మంటావా?"

"నమ్మితే నమ్మండి. లేకపోతే లేదు. జరిగింది ఇది. వాస్తవం!".

"నీలాంటి వాడి మాటలు నమ్మి మోసపోవడానికి నేను మామూలు వ్యక్తిని కాను. సి బి జె డి ని!  నా సర్వీసులో నీలాంటి వాడిని చాలా మందిని చూశాను...నీలాంటి నక్క తెలివి తేటలు ఉన్నవాడిని అంత సులువుగా వదిలిపెట్టను. నీ అంతు చూస్తాను".

సరిగ్గా అప్పుడే ఆమె ఫైల్ తీసుకు వచ్చింది. భర్త ఆవేశాన్ని పట్టించుకేలేదు. ఫైల్ విజయ్ కు అందిస్తూ,"ఇదే మీ ఫైల్. తీసుకోండి" అంది.

ఆమె వైపు కోపంగా చూశాడు ప్రకాష్. ఆగ్రహం కట్టలు తెంచుకుంది.  ఏదో అనబోయాడు. విజయ్ మాటలు విని ఆగాడు.

" వద్దొద్దు... ఫైల్ నాకు అవసరం లేదు. ఒకవేళ అవసరం అయితే ఎలా తీసుకోవాలో  నాకు తెల్సు! ఇలా దొంగ దెబ్బతో, పిల్లాడ్ని అడ్డం పెట్టుకుని మోసంతో తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేనేమీ తప్పులు చెయ్యలేదు! భయపడను. అయినా నన్ను పట్టుకునే ధైర్యం, అరెస్ట్ చేసే దమ్ము, నేరం నిరూపించే సత్తా ఉన్న మగాడు ఇంకా పుట్టలేదు. పుట్టడు కూడా...!"

"అంత కాన్ఫిడెన్సా !" అన్నాడు సి బి జెడి.

"ఎస్. నామీద నాకు నమ్మక ముంది! ట్రై  చెయ్. నీవల్ల అయితే పట్టుకో. సిబిఐ లో నీకు మంచి పేరు ఉంది. నీ సిన్సియారిటీ కి ఎన్నో అవార్డులు, రివార్డు చ్చాయని విన్నాను! అయినా నీకు దొరకను. అంత సులువుగా దొరికితే నా పేరు విజయ్ ఎలా అవుతుంది! నన్ను సృష్టించిన  దేవుడు కూడా నన్ను పట్టుకోలేదు. ఇక నువ్వెంత? కావాలంటే ట్రై చెయ్..."అని రెచ్చ గొట్టి అక్కడనుంచి వెళ్ళిపోయాడు విజయ్.

మాటలు ప్రకాష్ ఆవేశాన్ని మరింత పెంచాయి.

*****

1 comment:

Anonymous said...

JD lakshmi Narayan