Sunday, April 28, 2013

రూలర్ కథ -09


సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టి గేషన్ (C.B.I)

న్యూ ఢిల్లీ.

మీటింగ్ రూం లో అగుడు పెట్టాడు సి. బి. . డైరెక్టర్. అప్పటికే అతనికోసం ఎదురు చూస్తున్నారు జాయింట్ డైరెక్టర్లు, డిప్యూటీ కమీషనర్లు.

సరిగ్గా అప్పుడే డైరెక్టర్ రెడ్ పైల్ ఓపెన్ చేశాడు. అందరూ ఆశ్చర్యం గా చూశారు ఆయన్ని కాదు. పైల్ ని!

డిపార్ట్ మెంట్ లో పదిహేను దాకా రెడ్ పైల్స్ ఉంటాయి!

క్రెమ్ స్టాయిని బట్టి రక రకాల పైల్స్ ను తయారు చేస్తారు సి బి పోలీసులు.  రెడ్, బ్లూ, గ్రీన్, యెల్లో, బ్లాక్, ఆరెంజ్, పర్పుల్...కలర్స్లో ఉంటాయి పైల్స్.  దేశానికి  అత్యంత ప్రమాద కరమైన, పెద్ద పెద్ద వాళ్ళుగా చలామణి అవుతున్న పేరొందిన నేరగాళ్లకు మాత్రమే రెడ్ పైల్ ఉపయోగించడం జరుగు తుంది.

"ఇంత కాలానికి మళ్ళీ రెడ్ పైల్...ఎవరా వ్యక్తీ!"

"హాయ్ డియర్స్! " సి బి డైరెక్టర్ చెప్పడం ప్రారంభించాడు. ఆఫీసర్లంతా షాక్ నుండి తేరుకోలేదు! ఆయన చేతిలో ఉన్న రెడ్ పైల్ నే చూస్తున్నారు!

"మీరెప్పుడైనా శిరీష ఇండ స్ట్రీ స్ యజమాని విజయ్ పేరు విన్నారా? అతడ్ని చూశారా? .." సి బి డైరెక్టర్ అడిగిన ప్రశ్నకు ఒకరి మొహాలు మరొకరు చూసుకున్నారు. గుసగుసలు బయల్దేరాయి. తాము మీటింగ్ హాల్లో ఉన్నామనే సంగతి మర్చిపోయి మాట్లాడుకుంటున్నారు.

శబ్దాన్ని భగ్నం చేస్తూ డైరెక్టర్ చెప్పాడు. అతను . పీ  లో ఇండ స్ట్రీ లిస్ట్. అతను మూడేళ్ళ క్రితం సాధారణ ఉద్యోగి. నెల జీతం తో ఎలా బ్రతకాలి అని లెక్కలు వేసుకుని బ్రతికే మద్య తరగతి వ్యక్తి!.

కానీ ఇప్పుడు ... అని ఒక్క క్షణం ఆగి,అందరూ తన మాటలు వింటున్నారని గుర్తించి కొనసాగించాడు.

వేల కోట్లకు అధిపతి! అతని చేతిలో విద్యా లయాలు, హాస్పటల్స్ ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న లారీలలో పాతిక శాతం అతనివే! ఒకవేళ జరగా రానిది ఏదైనా జరిగితే ధరల పరిస్థితి ఏమౌతుందో ఆలోచించండి...

ఇంత డబ్బు సంపాదించడానికి అతనికి పట్టిన సమయం ఐదేళ్ళు! ఐదే ఐదేళ్ళలో వేల కోట్లు సంపాదించాడు. రాజకీయాల్లో, వ్యాపారాల్లో అతనికి బంధువులు లేరు. మరెలా సంపాదించాడు. అంతా రహస్యం!!

గదిలో కలకలం రేగింది. సి బి ఆఫీస్ అన్న సంగతి మర్చిపోయి మాట్లాడుకుంటున్నారు.

సి బి డైరెక్టర్ స్వరం కొనసాగింది.

"అతను తన సంపాదనలో కొంత ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు! ఉచిత విద్య అందిస్తున్నాడు. తక్కువ ఖర్చుతో వైద్య సేవలు చేస్తున్నాడు. ప్రజలలో మంచి పేరుంది. పెద్ద మనిషిలా చలామణి అవుతున్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్త గా ఉండాలి. లేకపోతే ప్రజలు తిరగబడే అవకాశం ఉంది".

"ఎం క్వయరీనా?' ఆఫీసర్ సందేహంగా అడిగాడు.

అక్కడున్న వారందరి చూపులు పైల్ మీదే ఉన్నాయి. దాన్ని గ్రహించాడు డైరెక్టర్.

"మీ అనుమానం నాకర్థమైంది! నేను కూడా అతనిపై బ్లూ పైల్ తయారుచేయాలా లేక రెడ్ పైల్ తయారు చేయాలా అని ఆలోచించాను. చివరకు రెడ్ పైల్ తయారు చేశాను. దానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది  ఐదేళ్ళలో వేల కోట్లు సంపాదించడం అంటే మాటలు కాదు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, రౌడీలు, స్మగ్లర్లు... కూడాఅంత సంపాదించ లేరు! ఇకపోతే రెండవది అతను మంచితనం తో కొంత పేదలకు ఖర్చు పెడుతున్నాడు. దానిపై రాష్ట్ర ముఖ్య మంత్రి భయపడుతున్నాడు! అతను రాజ కీయాల్లో వస్తాడా  లేక పారిశ్రామిక వేత్తగా ఉంటాడా ...అన్న సందేహాన్ని పార్టీ హై కమాండ్  దృష్టికి తెచ్చాడు. సెంట్రల్లో ఉన్నది వాళ్ళ పార్టీయే కదా! రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువ లేదన్నట్లు మనకు వెంటనే దర్యాప్తు చేయమని ఆదేశాలు అందాయి...అంటే రకంగా మన దర్యాప్తు సమాజానికే కాదు,  కొందరికి  రాజకీయ ప్రయోజనాలన్న మాట!"

వింటున్న వాళ్ళు ఒక్క క్షణం ఉలిక్కి  పడ్డారు . రాజ కీయ నాయకులు ఎంత తెలివైన వారు. ఎంత ముందు  చూపుతో  ఆలోచిస్తారు !  ఎంత నెట్ వర్క్ ఉంటుంది . ముందుగానే వాళ్లకు సపోర్ట్ చేసే వ్యక్తుల గురించి ఆలోచనకు వచ్చేస్తారు. ఇలా దర్యాప్తు సంస్థలను  అదుపులో పెట్టుకుని సహాయం కోరతారు. వినక పొతే భయపెడతారు. ఎంతకీ దారికి రాకపోతే వాళ్ళ మీద 'రైడ్' చేయిస్తారు. ఎంతటి దుర్మార్గపు ఆలోచన..."అక్కడున్న వాళ్ళ మదిలో రకరకాల ఆలోచనలు.

వాళ్ళు అలా ఆలోచనలో ఉండగానే సి బి డైరెక్టర్ తన మాటల్ని కోన సాగించాడు.

" కేసును మన జాయింట్ డైరెక్టర్ ప్రకాష్ కు అప్పగిస్తున్నాను! అతనికి రోజు నుండి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి. అతనికి ఏదైనా అవసరైమైన ప్పుడు మనమందరం సహాయ పడాలి. ఆపరేషన్ మాత్రం చాలా సీక్రెట్ గా జరగాలి..."

అక్కడున్న వాళ్ళందరూ అలా తిరిగి సి బి జె డి ప్రకాష్ వైపు చూశారు. 'కంగ్రాట్స్' చెప్పారు.

*****

సరిగ్గా అప్పుడే సముద్రం అలలో ఆడుకుంటున్న పిల్లవాడు 'గవ్వ' ను విసిరి వేశాడు. అది విజయ్ దగ్గర పడింది. దాన్ని తీసుకుని పిల్ల వాడి దగ్గరకు వెళ్ళాడు.

"విజయ్.. విజయ్..."అన్న శిరీష పిలుపులు సముద్రపు అలల శబ్దం తో కలిసి పోయాయి.

"సర్లే. తరువాత కలుద్దాం. టైం అయ్యింది. ఇంటి దగ్గర మానాన్న వెయిట్ చేస్తుంటాడు. లేటుగా వెళ్తే కారణాలు చెప్పాలి".

'సరే 'నంది శిరీష ఇక చేసేదేమీ లేక.

శిరీష అప్పుడు అక్కడ విజయ్ ను లత కు పరిచయం చేసి వుంటే, ఆమె విజయ్ గురించి శిరీషకు చెప్పుంటే ఇన్ని అపార్థాలు, అనర్ధాలు జరిగి ఉండేవి కాదేమో! పైగా విజయ్ మీద గౌరం కలిగేది. అలా జరగా లేదు. అంతా రాత!

అలా స్నేహితులతో మాట్లాడి తిరిగి వచ్చింది శిరీష.

"మా స్నేహితురాలికి పరిచయం చేద్దామనుకున్నాను. పిలిచాను. పలకలేదు. అలా దూరంగా ఉన్నావు. వాళ్ళు ఇంటికి త్వరగా వెళ్లాలని వెళ్ళిపోయారు..."

"పర్లేదులే. తరువాత ఎప్పుడైనా కలువొచ్చు!"

తనూ అలాగే అంది.

"నన్ను ఏమని పరిచయం చేస్తావు. స్నేహితుడనా, ప్రియుడనా,మోసగాడనా, డబ్బు పిచ్చోడనా..."


"ఎవరైనా ప్రియుడి గురిచి ఇతరుల ముందు చెడుగా చెబుతారా..?'

"హమ్మయ్య! నామీద నా ప్రియులాలికి కొంత కోపం తగ్గింది. అంతే చాలు. నీ కోపం చూసి రోజు నేను ఎడం వైపు లేచానేమోనని అనుమానం కలిగింది!" అన్నాడు.

  ఆమాటలకు ఆమె నవ్వేసింది. తిరిగి నవ్వింది. అందంగా నవ్వింది.

దృశ్యం మనోహరంగా ఉంది.


"మా స్నేహితురాలు లత చాలా మంచిది. మధ్య తరగతి అమ్మాయి..."

ఆమాటలకు అతను మౌనంగా ఉండి వుంటే సరిపోయేది.కానీ అతను అలా ఉండలేదు.

"అవునా?" అన్నాడు.

"అవును. పాపం పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. రెండేళ్ళ నుండి వెతుకుతున్నా మంచి సంబంధం దొరకలేదు".

"అమ్మాయి అందంగా ఉండదా!"

"చాలా బావుంటుంది".

"అయితే పెళ్ళెందుకు కాలేదు! ఇప్పుడు అమ్మాయిలకు మంచి డిమాండ్ ఉంది. అందులో అందమైన అమ్మాయిలకు డబ్బులు ఎదురిచ్చి మరీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు!" అన్నాడు కొంటెగా చూస్తూ.

"నిజమే అనుకో! మంచోళ్ళు దొరకద్దూ..."

ఆమాటలకు చిన్నగా నవ్వి అన్నాడు. "రెండేళ్ళు వెతికినా దొరకలేదా? ఆమె ఉద్యోగం చేస్తోందా? వాళ్ళ నాన్న ఏం చేస్తుంటాడు?".

"ఆయనేమీ చెయ్యడు! అమ్మాయికి  MNC  కంపెనీలో మంచి జాబ్".

"అదీ సంగతీ! తనకూతురికి పెళ్లి చేస్తే ఆర్థికంగా ఇబ్బందని అతను నెట్టుకొస్తున్నాడేమో!"

శిరీష కోపంగా అతని వైపు చూసింది. "ఎంత దారుణంగా ఆలోచిస్తున్నావు. కన్నా తల్లిదండ్రులైనా తమ పిల్లల గురించి అలా ఆలోచిస్తారా..."

"ఎందుకలా అనుకుంటున్నావు? తమ బిడ్డలా సంపాదనతో బ్రతికే తల్లి దండ్రులు, అన్న దమ్ములు, అక్కా చెల్లెళ్ళు... చాలా మంది ఇలా ఆలోచిస్తున్నారు. ఇది నమ్మలేని పచ్చి నిజం!"

అమ్మాయి కోపం తారా స్థాయికి చేరింది.

"ఎంత నీచంగా మాట్లాడు తున్నావు. మానవ సంబంధాలు గురించి నీకు తెలుసా? ఎలా తెలుస్తాయి. అనాధవి కదా!  తల్లిదండ్రుల, అక్క చెల్లెళ్ళ, బంధువుల... ప్రేమాను రాగాలు నీకెలా  తెలుస్తాయి. ఇన్నాళ్ళు నీకు డబ్బు పిచ్చే అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది నీకు ప్రేమానురాగాలు కూడా లేవని!"

అతను దెబ్బ తిన్నట్లు అలా శిరీష వైపు చూశాడు.

"అయినా నీదేం తప్పులేదులే! అనాధవి కదా! ఎవరో కానీ పారేస్తే, చెత్త కుప్పలో ఉన్నది తిని పెరిగిన నీకు మమతాను రాగాల గురించేమి తెలిస్తుంది. తల్లిదండ్రులను ఇలా నీచంగా మాట్లాడే నిన్ను ప్రేమిచడం నాదే బుద్ది తక్కువ!..." అనేసి అక్కడ్నుచి వడివడిగా వెళ్ళిపోయింది.

అతను నిర్ఘాంతపోయి అలాగే చూస్తుండి పోయాడు.

*****

1 comment:

Anonymous said...

Katha chaalaa baavundi