Sunday, April 28, 2013

రూలర్ కథ -08


విజయ్ తన సీట్లో కూర్చొన్నాడు. అతనికి ఫైల్ అదించింది అతని పర్సనల్ సెక్రటరీ కల్పన.

అతను ఫైల్ చూస్తున్నాడు. ఆమె చెప్పుకు పోతోంది.

"మొదట మీరు చెప్పినట్లే అనాధలు, కష్టాల్లో ఉన్నవారు, అంగ వైకల్యం తో ఉండి నా అన్న వాళ్ళ ప్రేమ లేక బాధ పడే వారిని గుర్తించి 516 మందిని తీసుకొచ్చాం. వారి వివరాలు ఇందులో ఉన్నాయని మరొక ఫైల్ అందించింది.  వారిని మానసిక వైద్యులు, పెద్దలు, గురువులు, అనుభవం ఉన్న వాళ్ళతో రకరకాల పరీక్షలు జరిపాం. చివరకు నిస్వార్ధంగా, అంకిత భావం తో, తిండి పెట్టిన వారి ఋణం జీవితాంతం మరిచిపో కూడదనే నిస్వార్ధం, పట్టుదల ఉన్నవారు, చెప్పినట్లు వినే 116 మందిని సెలక్ట్ చేశాం..."

అప్పుడతనికి వివేకానందుని మాటలు గుర్తుకు వచ్చాయి.

"దేశ భవిషత్తు మార్చడానికి వంద మంది యువకులు చాలు".

క్షణం సేపు  అతను మాట్లాడలేదు. ఆమె వెంటనే, " మీకోసం అభ్యర్థులందరూ ఎదురు చూస్తున్నారు!" అంది.

"సరే. పద పోదాం" అన్నాడు సీట్లో నుండి లేస్తూ.

"అభ్యర్థులను మీరొకసారి ఇంటర్వ్యూ చేసి కన్ ఫర్మ్ చేస్తే ..." అర్దోక్తి గా ఆపు చేసింది.

ఆ మాటలకు కు అతను చిన్నగా నవ్వాడు.

 "నీమీద నాకు పూర్తి నమ్మకం ఉంది! అందుకే పని నీకు అప్పగించాను".

ఆమెకు సంతోషం కలిగింది. తన బాస్ మెచ్చుకుంటే ఆనందం కలగనిదెవ్వరికీ!

మీటింగ్ హాల్లో 116 మంది అభ్యర్థులు కూర్చుని ఉన్నారు. విజయ్ అడుగు పెట్టేసరికి వాతావరణం అంతా నిశ్శబ్దం గా మారిపోయింది. విజయ్ అలా నడుచు కుంటూ ఎత్తయిన ప్లేస్ మీద ఏర్పాటు చేసిన స్టేజ్ మీదకు వెళ్ళాడు. అంతలో ఒకతను పరుగున వచ్చి షర్ట్ కు మైక్ అమర్చాడు. అతను ఏం చెబుతా డోనని ఆశ్చర్యంగా అతని వైపు చూశారు.

"మైడియర్ ఫ్రెండ్స్! ఇక్కడికి మిమ్మల్ని ఇలా ఆహ్వానించడంలో ఒక అంతరార్థం ఉంది..." అని ఒక్క క్షణం మౌనంగా ఉండి అందరూ శ్రద్దగా వింటున్నారని కన్ ఫర్మ్ చేసుకున్నాక మొదలు పెట్టాడు.

"నాకొక  జీవితాశయం  ఉంది! దాని కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాను. దానికి డబ్బులు కావాలి! మీ సహాయం కావాలి. మీరు సిటీ అంతా నేను మంచి వాడనీ, నా దగ్గరకు వస్తే సమస్యలు పరిష్కార    మవుతాయనీ ప్రజలకు చెప్పాలి! విజయ్ మంచి వాడు. పేదవాళ్ళకు సహాయం చేస్తాడు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటాడు. ధైర్య వంతుడు...డబ్బులిస్తే ఏమైనా చేస్తాడు!...ఇలా ఒకటి రెండు ఉదాహరణలు కలిపి చెప్పాలి. అంటే నేను చేయబోయే 'పని' ఏమిటో తెలిసిందా?" అని సమాధానం కోసం ఎదురు చూడ సాగాడు.

"సెటిల్ మెంట్లా!" అన్నారెవరో మెల్లగా వినిపించీ, వినపడనట్లుగా.

విజయ్ కు మాటలు విన్పించాయి.

"అవున్నిజమే! మీరనుకున్తున్నట్లు సెటిల్ మెంట్లే!  దానికి మీరు ప్రచారం చెయ్యాలి. సహజంగా ఉండాలి. మీరు ఇద్దరిద్దరు గా విడిపోయి టీ స్టాల్ దగ్గరో, చిన్న హోటల్ దగ్గరో మీలో మీరే మాట్లాడు కుంటున్నట్లు, నేను మీ కు సహాయం చేసినట్లు చెప్పుకోవాలి. ఎవ్వరికీ అనుమానం రాకూడదు!  అలా చేసినందుకు మీకు నెలకు ఫాతిక వేల జీతం".

"ఫాతిక వేలా!" ఆశ్చర్యంగా అన్నారు.

"అంతేకాదు. ఆరు నెలలో మీ పనితనం నచ్చితే మీ కు పర్మనెంట్ గా నా ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇస్తానని హామీ ఇస్తున్నాను"

అని చిన్న ఆశ కలుగ జేశాడు.

"ష్యూర్... తప్పకుండా" లాంటి పదాలు ప్రతీ వారి నోటి వెంట వెలువడ్డాయి.

సంతోషంతో విజయ్ హాల్లోనుంది బయటకు వచ్చాడు.

అయితే వాళ్ళను 'పెద్ద స్కాం ' లో భాగ స్వాములను చెయ్యాలనే విజయ్ ఆలోచనలు వారికి తెలియదు!

"థాంక్యూ వెరీ మచ్ కల్పనా! ఇంత పెద్ద బాధ్యతను సక్రమంగా నిర్వర్తించ  గలిగావు" మెచ్చుకున్నాడు విజయ్.

మొదట మీరు ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినపుడు నాకు భయం వేసింది. ఇంత పెద్ద పని సక్రమంగా నిర్వర్తించ గలనా అని అన్పించింది. అలా సందేహం కలిగిన ప్రతిసారీ మీరు నేను ఉద్యోగంలో చేరిన ప్పుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చేవి!

"నేను సెక్రటరీ ఎంత అందంగా ఉందని పట్టించుకోను! ఆమె ఉద్యోగానికి 'తగిన' వ్యక్తి అవునా, కాదా అని మాత్రమే ఆలోచిస్తాను. దాని మీదే నీ కెరీర్ ఆధారపడి ఉంటుంది".

మాటలు ఎప్పుడూ నా డ్యూటీని గుర్తు చేస్తుంటాయి అంది.

అతనికి ఆమెపై ఉన్న గౌరవం మరింత పెరిగింది.

*****

బీచ్  చాలా రష్ గా ఉంది. విజయ్ శిరీష వైపే చూస్తున్నాడు. ఆమె చాలా అందంగా ఉంది. సముద్రం మీద నుంచి వస్తున్న గాలికి ఆమె ముంగురులు అందంగా ఎగురుతున్నాయి. దగ్గరిగా జిరిగి ఆమె అతని చేతిని అందుకుని అతని అరా చేతిలో తన చేతిని వేసింది. ఆమె అతని భుజాల పైన వాలిపోయింది. మౌనంగా వాళ్ళు సముద్రాన్ని చూస్తున్నారు! ఆమె అలాగే అతడ్ని పట్టుకుని ఉంది.

అతడు సముద్రపు అలలలో  ఆడుకుంటున్న జంటలను చూశాడు. చుట్టూ  తిరిగి  చూశాడు.  గోవా  బీచ్ లో ఇలా    ఉంటారని   విన్నాడు! అయితే  ఇలా... అర్ధ నగ్నంగా ఉంటారని ఊహించలేక పోయాడు! అతనికి సినిమాలో టెం సాంగ్ గుర్తుకు వచ్చింది.

"పొద్దునే లేపేసి మడి కట్టేసి పూజ గదిలో కుర్చోబెట్టే వాడు మాకొద్దు...బికినీ వేసి బీచ్ లో వదిలేసే వాడు కావాలి".

ఆడవాళ్ళ మీద ఇలా 'పచ్చి' గా రాసే వాడిని తిట్టుకునే వాడిని. కాని ఇప్పుడు ఇలా వీళ్ళని చూసి పా రాసాడేమో ననిపిస్తుంది!.

ఏదో ఆలోచనలో  మునిగి  పోయాడు. తనని పట్టించుకో లేదని గ్రహించింది . చటుక్కున ప్రక్కకు  జరిగింది.

"మాటి మాటికీ ఏమిటలా ఆలోచనలో పడిపోతున్నావ్! ఎప్పుడూ డబ్బు ఆలోచనలేనా? డబ్బు ఒక్కటే   లోకం కాదు. నీకు డబ్బు పిచ్చి బాగా పట్టింది.నీకెన్ని చెప్పినా వెస్ట్. నీతో రావడం నాదే బుద్ది తక్కువ. ఎప్పుడూ అవే ఆలోచనలు..." అంది వెళ్ళడానికి పైకి లేస్తూ.

ఆమె చేతిని పట్టుకుని ఆపాడు."సారీ శిరీష! రా. కూర్చో..." అన్నాడు.

అమ్మాయి మరింత ఇరిటేట్ అయిపొయింది.

"అసలు డబ్బు సంపాదించగానే పెళ్లి చేసుకుంటా నని చెప్పావు. చివరకు సంగతి మరచి పోయావు. మా ఇంటికి రమ్మంటే రావు. ఇప్పుడొద్దు..అంటావు. సరదాగా ఇలా బయటకు వస్తే అలా ఆలోచనలతో ఉంటావు. చెప్పు  నేనంటే   నీకు ఇష్టం  లేదా ? నేనే  మైనా బలవంతం గా నిన్ను ఇబ్బంది పెడుతున్నానా?"

"... అలాంటిదేమీలేదు. నువ్వంటే నాకిష్టం. ఇష్టం కాదు ప్రాణం! కానీ నాకొక ఆశయం ఉంది. అది సాధించాలనే పట్టుదలతో కష్టపడుతున్నాను. అందుకే ఇప్పుడే పెళ్లి వద్దను కుంటున్నాను. అంతే గానీ మరే ఉద్దేశ్యంగానీ, ఆలోచన గానీ లేదు. ఇది నిజం. నన్ననమ్ము!".

"మరి అలా అయితే నీ ఆశయమేదో చెప్పొచ్చు కదా !"

"అది ఇప్పుడు చెప్పే విషయం కాదు. దానికి ఇంకా కష్టపడాలి. సంపాదించాలి. టైం వచ్చి నప్పుడు చెబుతా. అంతవరకు దాన్ని గురించి నన్నేమీ అడగకు. ప్లీజ్!"

"ఇంకెంత  సంపాదించాలి?ఇప్పుడే ఎన్నో కాలేజీలు స్థాపించావు.హాస్పిటల్స్ కట్టించావు. వందల సంఖ్యలో లారీలు కొన్నవని జనం చెప్పుకుంటున్నారు. అది చాలదా?".

"సరిపోదు. నా ఆశయం పెద్దది. ఇంకా ఇంకా శ్రమించాలి. సంపాదించాలి".

"అంత డబ్బెలా సంపాదిస్తావు?".

"అది టాప్ సీక్రెట్. సమయం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు నేనే చెడుతా. అంత వరకు నన్నడగకు."

"అయితే ఒక్కటి మాత్రం నిజం. నిన్ను జనం మెచ్చు కుంటు న్నారు. పేదలకు ఉచితంగా విద్య, తక్కువ ఖర్చుతో  వైద్యం అందిస్తున్నా వని. అందుకు నీకు అభినందనలు..."

మాటలకు ఎగతాళి చేస్తున్నట్లు చిన్న గా నవ్వాడు.

అమ్మాయి చిత్రంగా అతని వైపు చూసింది.

"ఎవరు చెప్పారు నీకు నేను ప్రజా సేవ చేస్తున్నానని! అంతా బూటకం. అబద్ధం. పేద పిల్లలంటే ఎవరు? మా దగ్గర చదివే వాళ్ళలో ఎక్కువ మంది వెనుకబడిన తరగతులవారు. వారికి ప్రభుత్వం స్కాలర్ షిప్ లు  ఇస్తుంది. హాస్టల్ కు సరిపడా సోమ్ములిస్తోంది. అంటే వారి డబ్బుతో వారే చదువు తున్నారు. ఇది నిజం. అయితే సంగతి వారికి తెలియదు...నేనేదో ఊరికే నా డబ్బుతో చెప్పిస్తున్నాని అనుకుంటున్నారు. ఇకపోతే వైద్యం ఇది కూడా కాస్త ఖరీదైనది. డాక్టర్లకు నేను జీతం ఇస్తున్నాను. కాబట్టి వారు మా హాస్పటల్లో పది రూపాయలకే వైద్యం చేస్తున్నారు. అసలు  విషయాన్ని దాచి పెట్టి దేశ విదేశాలలో ప్రచారం చేస్తూ డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నాను. ఇకపోతే జాగ్రత్త గా గమనించు.

  హాస్పిటల్ చుట్టూ ఉన్న మెడికల్ షాప్ లన్నీ నావే! పది రూపాయలు ఫీజు తీసు కునే డాక్టర్లు రాసే మందులు మాత్రం చాలా ఖరీదైనవి! జబ్బు కు ధనిక,పేద తేడా లేదు. ఎంతైనా ఖర్చు చేస్తారు. ఇది వాళ్ళ వీక్ నెస్. చివరకు నేను డాక్టర్లకు ఇచ్చే జీతం కూడా మందుల కమీషన్ పై ఆధారపడి ఉంటుంది. ఇది తెలియని ప్రజలు నన్ను దేవుడం  టున్నారు! నా జేబునుండి ఒక్కరూపాయి కుడా ఖర్చు పెట్టకుండా సంపాదిస్తున్నాను."

"ఎంతటి మోసం?"అప్రయత్నం గా  అంది.

"త్వరగా డబ్బు లు సంపాదించాలంటే ఇలాంటివి చెయ్యాలికదా !"

"అలాగని ప్రజల జీవితాలతో ఆడుకుంటావా?"

"నేనెవర్నీ బలవంతం పెట్టలేదు. ఇక తప్పేముంది!"

"ప్రజల బలహీనతలు ఆసరా చేసుకుని డబ్బులు,పేరు ప్రతిష్టలు  సంపాదిస్తున్నావు.  తన మోసాల్ని కూడా సమర్ధించు కునే నీలాంటి మోసగాడిని ఏమనాలి? ఏం చెయ్యాలి...?" అంటూ విజయ్ ను తిడుతున్న అమ్మాయికి , కొద్ది దూరంలో తన స్నేహితు రాళ్ళతో కలిసి వెళుతున్న 'లత' కన్పించింది.

"లతా...లతా" అని పిలుస్తూ వవడిగా అడుగులు వేసుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళింది.

తన పేరుపెట్టి ఎవరు పిలిచినా ఠక్కున వినిపిస్తుంది. అదే ప్రతిఒక్కరికి తన పేరు పై ఉన్న మమకారం!

అలా తనకోసం వస్తున్నా శిరీషను చూసి ఆగిపోయింది. ఆమె తో పాటే ఆమె స్నేహితు రాళ్ళు కూడా ఆగారు.

"ఏమీటీ ఇలా...సర్ ప్రైజ్!" అంది శిరీష లత తో .

'ఫ్రెండ్స్   తో వచ్చాను' అని తనతో వచ్చిన   ఫ్రెండ్స్ ను పరిచయం చేసింది లత. వాళ్ళు మాటిమాటికీ వాచీ చూసుకుం  టున్నారు.

"నువ్వేమిటీ  ఇలా వచ్చావ్!" లత అడిగింది.

విజయ్ తో వచ్చాను.

అప్పటివరకు వాచీలు చూసుకుంటున్న వాళ్ళు కూడా ఆసక్తిగా చూశారు. ఎదుటి వాళ్ళ ప్రేమ, గాసిప్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా!

"ఉండు. పరిచయం చేస్తాను" అని విజయ్ కోసం చూసింది.

******

No comments: