Sunday, April 28, 2013

రూలర్ కథ -06


"ఐదు నక్షత్రాల హోటల్ ముందు కారు ఆగింది. డ్రైవర్ వినయంగా వచ్చి కారు డోర్ తెరిచాడు. అందులోచి దిగాడు బ్యాంక్ మేనేజర్".

అతడ్ని రిసీవ్ చేసుకోవడానికి కారు దగ్గరకు వెళ్ళాడు విజయ్.

కారు డ్రైవర్ విజయ్ ను చూపించి 'ఇతనే' అన్నాడు బ్యాంక్ మేనేజర్ తో.

విజయ్ పరిచయం చేసుకున్నాడు.

"మిమ్మల్ని ఎక్కడో చూశాను. ... గుర్తొచ్చింది. ఎమ్మెల్యే దగ్గర చూశాను..."అన్నాడు మేనేజర్ విజయ్ తో.

విజయ్ చిన్నగా నవ్వి, అవునన్నట్లు తలూపాడు.


మేనేజర్ తో కలిసి హోటల్ గదిలోకి అడుగు పెట్టాడు విజయ్. అప్పటికే అక్కడ మోడ్రన్ డ్రస్సులో అర్ధ నగ్న దుస్తులతో కుర్చుని ఉన్నారు ఊర్వశి హోటల్ అమ్మాయిలు. విజయ్ ని చూడగానే వినయంగా లేచి నిలబడ్డారు.

మేనేజర్ కూర్చోవడానికి కుర్చీ చూపించాడు విజయ్. మేనేజర్ కూర్చున్నాడు. మద్యం బాటిళ్ళూ, గ్లాసులు తెచ్చి మేనేజర్ టేబిల్ మీద పెట్టారు అమ్మాయిలు. వాళ్ళు అలా కాస్త ముందుకు వంగి మందు సీసాలు టేబిల్ మీద పెడుతున్నప్పుడు ' దృశ్యాన్ని' అతను అలా కళ్ళర్ప కుండా  ఆశగా చూడడాన్ని గ్రహించాడు విజయ్.

హోటల్ గది తాళాలు అమ్మాయిలకు ఇస్తూ "మేం కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. మీరు ప్రక్కనే ఉన్న 109 గది లోకి వెళ్ళండి. అక్కడే ఉండండి. రాత్రికి మీతో 'పని' ఉంది. సరేనా?" అన్నాడు విజయ్.

సరే నన్నట్లు తలూపి వాళ్ళు తమకు కేటాయించిన గది తాళాలు తీసుకుని వెళ్ళిపోయారు.

రాత్రికి తాము మేనేజర్ తో 'కలిసి' ఉండటం వలన విజయ్ కోట్ల వ్యాపారంలో తాము కూడా భాగమే నన్న 'నగ్న' సత్యం వారికి ఆక్షణం తెలియదు!

మద్యం, 'తోలు' వ్యాపారం అడ్డమైన పనులకు షార్ట్ కట్స్!

తరువాత మందు గ్లాసులో పోసి మేనేజర్ కు అందించాడు విజయ్.

అలా అవీ ఇవీ మాట్లాడుకుంటూ రెండు రౌండ్లు పూర్తీ చేశారు. ఇక తను చెప్పాల్సి అవసరం వచ్చిందని గ్రహించి అసలు విషయం బయట పెట్టాడు విజయ్.

"నేనే వంద కోట్లు విలువ చేసే 'శిరీష్ఇండస్ట్రీస్ 'ను కొంటున్నాను! కంపెనీ యజమాని ఆనందరావు కూతురు నేను ప్రేమించుకుంటున్నాం. తరువాత పెళ్లి చ్సుకోబోతున్నాం. నిజానికి ఫ్యాక్టరీ ని కొనట్లేదు! ఆనందరావు కు శిరీష ఏకైక కుమార్తె. చివరకు ఫ్యాక్టరీ నాదే! అలాంటప్పుడు కొనడం దేనికీ!!అనవసరంగా రిజి స్ట్రేషన్ ఫీజు దండగ! ఫ్యాక్టరీ పేరు అఫీషియల్ గా అతని పేరుమీదే ఉంటుంది. ఆయనకు డబ్బు ఇవ్వడం మూలంగా అమ్మేశానని అనుకుంటాడు. రిజి స్ట్రార్ ఆఫీసులో అయన సంతకం చేసే డాక్యుమెంట్ల లో బ్యాంక్ లోన్, నా అగ్రిమెంట్లు కాగితాలు కూడా ఉంటాయి. కాబట్టి  తరువాత ప్రాబ్లెమ్స్ రావు! ఫ్యాక్టరీని కొన్న తరువాత నా చేతుల్లోకి తీసుకుని లాభాల బాట పట్టిస్తాను!"

"ఎందుకలా?"

"ఆనంద రావు ఎంతో కష్టపడి నెలకొల్పిన కంపెనీ అది. ప్రస్తుతం నష్టాల్లో ఉంది. తన కళ్ళముందే తన బిడ్డలా పెచుకున్న కంపెనీ మూత పడుతుందంటే తట్టుకోలేక పోతున్నాడు. అమ్మేయాలనుకున్నాడు. కాని అయన కూతురికి అది ఇష్టం లేదు. నా కాయే భార్య కోరిక మేరకు నేనే కంపెనీ కొనాలను కుంటున్నాను. దానికి మీరు సహాయం చేయాలి".

"నష్టాల్లో ఉన్న కంపెనీకి అప్పు ఇవ్వడం కుదరదు".

"దాన్ని మా అడిటర్ల తో ఓవర్ వాల్యూ చేసి బ్యాలన్స్ షీట్  తయారు చేస్తాను. దాని పైన లోన్ ఇవ్వండి. ఒక్క సంవత్సరం లో తిరిగి ఇచ్చేస్తాను."

"అలా ఇవ్వొచ్చు  గానీ ...లీగల్ గా ప్రాబ్లెమ్స్ వస్తాయి".

"అవన్నీ నేను చూసుకుంటాను. కావాలంటే మీతో ఎమ్మెల్యే గారు మాట్లాడతారు" అని చీకట్లో రాయి విసిరాడు.

'మనవాడే. పర్లేదు... చెప్పు' అన్న ఎమ్మెల్యే మాటలు గుర్తుకు వచ్చాయి మేనేజర్ కు. రాయి తగలాసిన చోటే బలంగా తగిలిందనుకున్నాడు విజయ్.

అయినా బెట్టు చేశాడు బ్యాంక్ మేనేజర్. "మీకు బ్యాంక్ రూల్స్ గురించి తెలియదనుకుంటా ! అంత డబ్బు ఇవ్వం. పైగా మార్కెట్ వాల్యూ అమాంతం పెంచి లోన్ ఇవ్వవు!".

"రూల్స్ సంగతి నాక్కూడా తెలుసు. అయితే అంత మొత్తం 'లోన్' తీసుకున్నానే సంగతి నీకూ, నాకూ తప్ప మరెవ్వరికీ తెలియదు! ఒకవేళ తెలుసున్నా, అది 'ఫ్రూవ్' చేయడానికి సమయం పడుతుంది. లోపల నేనే తిరిగి ఇచ్చేస్తాను..."అని చెప్పుకు పోతున్న విజయ్ మాటలకు అడ్డు తగిలాడు  మేనేజర్.

"రూల్స్ గురించి మీకు అంతగా తెలియదు! చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. అలా చేస్తే మా ఉద్యోగాలు పోతాయ్! మేం జైలు పాలు అవ్వాల్సి వస్తుంది".

చాలా సేపట్నుంచి ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాడిలా చెప్పడం ప్రారంభించాడు విజయ్.

"బ్యాంకులకు ఎగనామం పెట్టిన సంస్థలు చాలా ఉన్నాయి. హర్షద్ మెహతా సంస్థ 812 కోట్లు, రాజిందర్ సంస్థ  382 కోట్లు,  ముఖేష్ గుప్తా 587 కోట్లు... ఎగవేత దారులనుండి బ్యాంకు లకు సుమారు లక్ష్యా యాబై వేల కోట్ల మేరకు అప్పులున్నాయి. 2010 నాటికి లెక్కల  ప్రకారం బకాయిల వసూల ట్రిబ్యునల్ల దగ్గర రూ. 90,110 కోట్ల విలువైన 33,595 కేసులు పెండింగ్ లో ఉన్నాయి....అన్నాడు. అతను తను చెప్పేది బాగా వింటున్నాడని కన్ఫర్మ్ చేసుకున్నాక మళ్ళీ కొనసాగించాడు.

మంత్రం వేసినట్లు ఆశ్చర్యం గా వింటున్నాడు మేనేజర్. విజయ్ నోటివెంట వెలువడుతున్న గణాంకాల సైతం అతడ్ని ఆశ్చర్యం తో ముంచెత్తు తున్నాయి!

"వ్యవస్థ లోని లొసుగుల ఆధారంగా చేసుకుని పెద్ద పెద్ద మోత్తాలతో రుణాలను ఎగవేయడం పెద్ద పెద్ద సంస్థలకు పరిపాటిగా మారి పోయింది. రాజ కీయ నాయకులు తమ పలుకు బడిని ఉప యోగించి తమకు కావలసిన కంపెనీలకు బ్యాంకులు, ఫైనాన్షియల్ కార్పోరేషన్ల నుండి భారీ మొత్తాలలో రుణాలు మంజూరు చేసుకోవడం, అవి వాటిని తిరిగి చేల్లిస్తున్నాయో లేదో పట్టించుకోక పోవడం మామూలే. మన దేశంలో కొన్ని బ్యాంకులు ఖాయిలా పడడానికి ఇటు వంటి బకాయి దారులే కారణమవడం సత్య దూరం కాదు. బ్యాంకులు కూడా సాధారణ రుణగ్రస్తుల  నుంచి బకాయిలను ముక్కు పిండి వసూలు చేస్తాయి. అదే బడా సంస్థలు విషయం వచ్చే సరికి చేతు లు ఎత్తేస్తాయనే అభిప్రాయం ప్రజల్లో ఉన్నదే! ఋణం ఎగవేసిన వ్యక్తీ తన సంస్థకు భారీ నష్టాలు వచ్చాయని ప్రకటించి చేతులు దులిపేసుకోవచ్చు. ఖాయిలా పడిన పరిశ్రమలు కంపెనీల చట్టం లోని  నిబంధనలను అనుసరించి పారిశ్రామిక, ఆర్ధిక పునర్నిమాన బోర్డు రక్షణను కోరవచ్చు. ఒకవేళ వారిని రుణాల వసూల త్రిబునళ్ళకు లాగినా, రుణ వేత దారు వీలైనంత జాప్యం చేసే ఎత్తుగడలను అనుసరించి రుణదాతలను మూడు చెరువుల నీళ్ళు తాగించవచ్చు".


విజయ్ చెప్పడం పూర్తయినా మేనేజర్ నోరు మెదపక అలాగే ఉండిపోయాడు!

"మీరు తలచుకుంటే నాకు అప్పు ఇవ్వడం పెద్ద కష్టం కాదు! ఆలోచించండి. మీరు చేసిన సహాయానికి 'తగిన' ప్రతిఫలం ఉంటుంది." బేరం పెట్టాడు.

"లోన్ ఇవ్వొచ్చు గానీ..." అర్దోక్తి గా ఆపుచేశాడు మేనేజర్.

"మీకేం భయం లేదు! నాకు పొలిటికల్ పవర్ ఉంది. మీకు అనుమానం ఉంటే చెప్పండి. ఎమ్మెల్యే తో మాట్లాడిస్తాను".

"మీమీద  నమ్మకం ఉంది. నాకు ఇస్తామన్న కమీషన్..."అంటూ నసిగాడు.

"మీకు సంశయం అక్కర్లేదు. లోన్ ఇచ్చేటప్పుడు మీ కమీషన్ తీసుకుని మిగిలినది ఇవ్వండి".

అతను సరే నన్నాడు.

*****

'పోస్ట్' అంటూ కేక వేశాడు పోస్ట్ మేన్. పిలుపు వినగానే గేటు దగ్గరకు తూనీగలా వెళ్ళింది శిరీష. అతను ఇచ్చిన కాగితం మీత సంతకం పెట్టి తనకు వచ్చిన కవర్ తీసుకుంది. పోస్ట్ మేన్ వెళ్ళిపోయాడు. తిరిగి ఇంట్లోకి వస్తూ ఫ్రం అడ్రస్ చూసింది. పత్రికాఫీసు అడ్రస్ ఉంది. ఏదో శుభ వార్త ఉంటుందని మనసుకు అన్పించింది. సంతోషం పరవళ్ళు త్రోక్కింది. కవర్ విప్పాలనే ఆతృతతో త్వర త్వరగా విప్పింది. తన కళ్ళను తానే నమ్మలేక  పోయింది.

"కవితల పోటీలో ప్రధమ బహుమతి!"

వార్తను చదివింది. మళ్ళీ చదివింది. తనివితీరా చదివింది. ఆనందంతో ఎగిరి గంతులేసింది. అలాగే బెడ్ మీద పడుకుంది. ఉత్తరాన్ని తన గుండెలకు హత్తుకుంది. అంత సంతోషంలో కూడా అమ్మాయికి  విజయ్ గుర్తొచ్చాడు.

'విజయ్' నేనొక కవిత రాశాను. ప్రధమ బహుమతి వచ్చిందని అతనికి చెప్పాలి.  అది వినగానే తన కవితను మెచ్చు కోవాలి. తన వైపు ఆరాధన గా చూడాలి. ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవాలి . తను సిగ్గు పడుతూ వద్దొద్దు... అనాలి. అతను 'ప్లీజ్!' అంటూ బ్రతిమలాడాలి... అలా కలలు కంటోంది.  వాటిని భగ్నం చేస్తూ ఆనం దరావు గొంతు విన్పించింది.

"శిరీష! అక్కడేం చేస్తున్నావు. ఇలారా".

తన తండ్రి ఏదైనా ముఖ్యమైన పని ఉంటే తప్ప అలా అరిచి రమ్మని చెప్పాడు. పిలుపు హాల్లో నుండి విన్పించిందని గ్రహించి హాల్లోకి పరుగున వచ్చింది.  అక్కడ సోఫా లో కుర్చుని ఉన్నాడు ఆనందరావు . అతని భార్య కూడా అక్కడే నిల్చొని ఉంది. అతని ముఖంలో కోపం, అవమానం కొట్టొచ్చినట్లు కన్పిస్తున్నాయి. శిరీష సంతోషమంతా గాల్లో కలిసి పోయింది.

"విజయ్ నీ కెంత కాలంగా తెల్సు?"

ప్రశ్న ఆనంద రావు నోటివెంట వెలువడు తుందని  అమ్మాయి ఊహించలేదు. అనుకోని ప్రశ్న అలా సడెన్ గా అడిగే సరికి బిత్తరపోయింది. భయ పడిపోయింది. క్షణంలో  ఏం చెప్పాలో  ఆమెకు అర్థం కాలేదు. తెలుసు, తెలియదన్నట్లు తలూపింది.

"ఇప్పుడు అతడి గురించి డాడీ ఎందుకు అడిగాడు? అతని గురించి డాడీ కి మైనా తెలిసిందా ? విజయ్ ఇప్పుడెక్క డున్నాడు? ఏం చేస్తున్నాడు?...."అని ఆలోచిస్తున్న శిరీషకు ఆనందరావు మాటలతో సమాధానం దొరికింది.

"వాడు సాధారణ లెక్చరర్! కానీ రోజు నా ఫ్యాక్టరీ కొన్నాడు. వాడికి అంత డబ్బెక్కడిది! ఎవరిచ్చారు. ఎలా సాధ్యం?"

"ఏమిటీ! విజయ్ మన ఫ్యాక్టరీ కొన్నాడా? మీరు చెప్పేది నమ్మ శక్యం కాకున్నది. నిజమా   డాడీ!" మరింత ఆశ్చర్యం గా అడిగింది.

అమ్మాయి మాటలతో మరింత కడుపు మంటతో రగిలి పోయాడు. అతని చేతి వ్రేళ్ళు బిగుసుకున్నాయి. ఊపిరి బిగ పట్టాడు! కోపంగా శిరీష వైపు చూశాడు. అమ్మాయి ముఖంలో అలాగే ఉన్న ఆశ్చర్యాన్ని చూశాడు! తరువాత మనసు మార్చుకున్నాడు. "అవునన్నట్లు" తలూపాడు. కోపంతో బిగ పట్టిన గాలిని నోటి ద్వారా 'తుస్సు' మంటూ వదిలాడు.

"నిన్నటిదాకా హుందాగా ఉన్నతను ప్రస్తుతం సర్వం కోల్పోయిన రారాజులా ఉన్నాడు! చే జారిన ఫ్యాక్టరీని తలచుకుని దుఃఖం , అవమానం తో రగిలి పోతున్నాడు. అతడి బాధ వర్ణనాతీతం! అలా మౌనంగా కుర్చుని ఉన్నాడు. అతని ప్రక్కనే శిరీష తల్లి కూడా నిల్చొని ఉంది.

అప్పుడక్కడ వాళ్ళందరి మద్య మౌనమే రాజ్యం చేసింది.

*****

2 comments:

Anitha Ravellapudi said...

Nice story. Its very interesting now. First two parts are little bit boring.

Anonymous said...

excellent