Sunday, April 28, 2013

రూలర్ కథ -05


"ఛాలెంజ్ అయితే హీరో లెవల్లో చేశాను. ఇప్పుడు అంత డబ్బు సంపాదించడం ఎలా? సుమారు వందకోట్లు సంపాదించాలి. తలచుకుంటేనే దడ పుడుతోంది. మరి 'అంత' డబ్బు సంపాదించడం సాధ్యమేనా? మరి అప్పుడెందుకు నోరు జారాను. కోపమా? అవేశమా? ప్రేమా?...ప్రేమ.అవును ప్రేమే! శిరీషను మనస్పూర్తిగా ప్రేమిస్తున్నాను. ఎంతటి తియ్యటి అనుభూతి. అమ్మాయి రూపాన్ని తలచుకుంటే ఎంత బావుంటుంది మనసుకు. శిరీష అందం గుర్తొస్తేనే ఏవేవో కలలు. కళ్ళ నిండా మెరుపులు.  అంత మంచి అమ్మాయిని వదులుకోకూడదు! అయితే డబ్బు సంపాదించాలి. ఎలా..? "మళ్ళీ మొదటి కొచ్చాయి ఆలోచనలు. అతడ్ని పిచ్చేక్కిస్తున్నాయి. వాటిని చెదరకొడుతూ ఎవరో తలుపు తట్టిన శబ్దం విన్పించింది.

"కాలింగ్ బెల్ కొట్టొచ్చు కదా ! అలా తలుపులు బాదడం దేనికీ? "అని విసుక్కుంటూ వెళ్లి తలుపు తెరిచాడు. ఎదురుగా నలుగురు దృఢ కాయులు కన్పించారు. విజయ్ ను చూడగానే వెంటనే వాళ్ళు తాము వచ్చిన విషయాన్ని బయట పెట్టారు.

"మిమ్మల్ని ఎమ్మెల్యే పిలుచుకురమ్మన్నారు".

"నన్నా! ఎందుకూ?".

"తెలియదు.ఏం!..చెబితేగానీ రావా?"

"అంతగా అవసరం అనుకుంటే అతడ్నే రమ్మనమని చెప్పండి!" అన్నాడు విజయ్. వెంటనే మనసు మార్చుకున్నాడు. "కాసేపాగండి. వస్తాను" అన్నాడు. తరువాత వాళ్ళు వచ్చిన వాహనంలోనే ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాడు.

అప్పటివరకు విజయ్ కోసం ఎంతో టెన్షన్ తో ఎదురు చూస్తున్నాడు రాయన్న. విజయ్ ను చూడగానే విసురుగా కుర్చీ లోంచి లేచాడు. అతడికి దగ్గరగా వచ్చి, 'వీడేనా?" అని తన మనుషుల్ని అడిగాడు.

అవునన్నట్లు వాళ్ళు తలలాడించారు.

ఏకవచనం తో తనను సంభోదించినందుకు కలిగిన కోపాన్ని బలవంతంగా కంట్రోల్ చేసుకున్నాడు విజయ్.

"ఇంకా పాతికేళ్ళు నిండినట్లు లేదు! నాతో పెట్టుకున్నావ్! అప్పుడే ప్రాణాల మీద ఆశ పోయిందా?" అన్నాడు రాయన్న.

"ముందు నన్నెందుకు రమ్మన్నారో చెప్పండి?" అన్నాడు కోపంతో. ఆనంద రావు తనను బెదిరించడానికి ఇలాంటి ఏర్పాట్లు చేసి ఉంటాడని అనుకున్నాడు మనసులో. అయితే కొద్ది సేపటికే తన ఆలోచనలు తప్పని తెలుసుకున్నాడు.

ఎమ్మెల్యే అరికాలి మంట నెత్తికెక్కింది. గొంతు పెద్దది చేసి మాట్లాడాడు.

"నేనెవరినో తెలియదా? తెలియకుండానే మా వాళ్ళతో గొడవ పెట్టుకున్నావా? పోలీసని చెప్పి మావాళ్ళను భయపెట్టావా? నీకెన్ని గుండెలురా. నీ కంటికి ఎమ్మెల్యే అంటే చేతికి గాజులు తొడుక్కునే వాడనుకున్నవా...!"

విజయ్ కి అప్పుడు గుర్తొచ్చింది. ఆరోజు శిరీషను కాపాడిన సంఘటన. వెంటనే చెప్పాడు.

"చూడండి! ఆరోజు  కావాలనే మీ వాళ్ళతో నేను గొడవ పడలేదు. ఆడ కూతుర్ని ఎవరో అల్లరి చేస్తున్నారు. అమ్మాయి జీవితం నాశనం అయిపోతుందనుకుని వాళ్ళ నుండి కాపాడాను. పోలీసని బెదిరించాను. అంతా మానవతా దృక్ఫదంతో చేశాను. "అని ఒక్క క్షణం ఆగి, మళ్ళీకొనసాగించాడు.

" లోకంలో అందర్నీ బాగు చేసే ఉద్దేశ్యం గానీ, ఆలోచన గానీ నాకు లేదు. ఎందుకంటే అది నావల్ల కాదు! నా ముందు ఆడ కూతురు మాన ప్రాణాలు పోతుంటే చూడలేక పోయాను. అనవసరంగా నేనెవరి జోలికి వెళ్ళాను. నాతో పెట్టుకుంటే నేనెవర్ని లెక్క చేయను. వదిలిపెట్టను. వాళ్ళ అంతు చూస్తాను. జరిగిందేదో జరిగి పోయింది. నా మానాన నన్ను వదిలేయండి. ఇక నేను మీ జోలికి రాను. కాదు, కూడదని హద్దులు దాటితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి..." అని హెచ్చరించి వెనుతిరిగాడు.

అయితే అవినీతినుండి దేశాన్ని కాపాడే సదుద్దేశంతో తను జీవితా ఆశయాన్ని  ఏర్పరచుకో బోతున్నాననీ, దాని కోసం తను అహర్నిశలు కస్టపడి పని చేయబోతున్నాననీ విజయ్ కు క్షణం తెలియదు.

సరైన టైం కు సరియైన నిర్ణయాలు తీసుకునే వాడు మంచి నాయకుడు. విజయ్ మాట్లాడుతూ ఉండగానే అతడ్ని మనసులోనే అంచనా వేశాడు రాయన్న.

విజయ్ రెండడుగులు ముందకు వేశాడో లేదో వెనకనుండి పిలిచాడు రాయన్న.

"ఆగండి".

ఆగాడు విజయ్.

ఎమ్మెల్యే అతని దగ్గరకు వచ్చి మాట్లాడాడు.

"చూడు బాబు! నేనే చాలా పొరపాటు పడ్డాను. నాకు అన్యాయం చేశావనే కోపంతో నీమీద పగ పెంచుకున్నాను. అప్పుడే ఏమైనా చేస్తే అల్లరవుతానని ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. అంతే తప్ప నీగురించ్ ఎప్పుడు మంచిగా ఆలోచించ లేదు. నిన్ను శత్రువుగా ఊహించుకోవడం చేత నీ మంచి తనాన్ని గ్రహించ లేక పోయాను! నీదేం తప్పు లేదులే! క్షణంలో నేను అక్కడ ఉన్నా అదే పని చేసి ఉండే వాడ్ని!.. అంచేత సంగతి వదిలి పెట్టండి. ..అని కాసేపాగి, తరువాత తన మనుశాలను చూపిస్తూ, " అలాంటి వాళ్ళు పాతిక మంది ఉన్దేదానికన్నా నీ లాంటి వాడు ఒక్కడున్నా చాలు! నువ్వు నాకు నచ్చావ్. నాతో ఉండడానికి నీకు ఇష్టమైతే చెప్పు. ఆలోచించుకో..."

ఎమ్మెల్యే మాటలు జాగ్రత్త గా విన్నాడు విజయ్.

"ఎమ్మెల్యే తో ఉంటె ఎంత సంపాదించవచ్చు. మహా అయితే ఏడాదికి ఎంత వస్తుంది! ఇక్కడ పనిచేయడం కంటే కా లేజ్ లోనే పనిచేయడం బెటరేమో. ఎమ్మెల్యే మనిషిగా 'ఏమైనా' అదనంగా సంపాదించ వచ్చా? అలా ఎలా వీలవుతుంది. కోటి రూపాయలు సంపాదించాలంటే  ఎంత కాలం పడుతుంది.ఇక్కడ కాక మరెక్కడైనా ఇంతకంటే ఎక్కువ సంపాదించ వచ్చా? ..." విజయ్ మనసులో రకరకాల ఆలోచనలు.

విజయ్ ముఖాన్ని పరిశీలనగా చూసి అడిగాడు ఎమ్మెల్యే.

"ఏమిటాలోచిస్తున్నారు?".

విజయ్ ఏదో చెప్పబోయాడు. అంతలో అక్కడికి ఒకతను వచ్చి ఎమ్మెల్యేతో అన్నాడు." మీ కోసం  బ్యాంక్ మేనేజర్ వచ్చాడు".

"వెంటనే పిలుచుకురా". అన్నాడు. తరువాత భార్యను పిలిచాడు.

"లక్ష్మీ! బెడ్రూంలో రాత్రి చిన్న సూట్ కేసు పెట్టాను. తీసుకురా".

బ్యాంక్ మేనేజర్ వస్తూనే ఎమ్మెల్యే కి నమస్కారం పెట్టాడు.

ప్రతి నమస్కారం చేశాడు ఎమ్మెల్యే.

బ్యాంక్ మేనేజర్ ఏదో చెప్పడానికి సంశయిస్తున్నట్లు విజయ్ వైపు చూశాడు. దాన్ని ఎమ్మెల్యే గ్రహించాడు.

"పర్లేదులే చెప్పు. అతను మనవాడే!"

"మీరు చెప్పినట్లు ఆస్తి ఓవర్ వాల్యు చేసి లోన్ ఇచ్చాను. తరువాత ప్రాబ్లెమ్స్ రాకుండా..."నసిగాడు.

అవన్నీ నేను చూసుకుంటాను.నీకేమీ భయం లేదన్నాడు.

అంతలో  అక్కడికి లక్ష్మి సూట్ కేస్ తో వచ్చింది.

బ్యాంక్ మేనేజర్ ఎమ్మెల్యే వైపు చూశాడు. ఆయన తీసుకోమన్నట్లు సైగ చేశాడు. కాస్త నమ్మకం కుదిరాక ఆమె చేతిలో నుండి క్యాష్ అందుకుని అక్కడనుంచి వెళ్ళిపోయాడు.

అతను అలా వెళ్ళగానే విజయ్ ఎమ్మెల్యే తో అన్నాడు.

"నాకు రెండ్రోజులు టైం ఇవ్వండి ఆలోచించుకుని చెబుతాను...వస్తాను".

'సరే'నన్నాడు ఎమ్మెల్యే.

అక్కడనుంచి అతను కూడా వెళ్ళిపోయాడు.

*****

రోడ్డు మీద అలా నడిచి వస్తున్నాడు విజయ్. అతని మదినిండా  ఆలోచనలు డబ్బు చుట్టూ  తిరిగుతున్నాయి.

అజీమ్ ప్రేమ్ జీ  విప్రో సంస్థ ఆధిపతి. కుటుంబ సాంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తున్న నూనె వ్యాపారంలో అడుగుపెట్టాడు. సబ్బుల తయారి చేపట్టాడు. కంప్యూటర్ రంగంలో కాలు పెట్టాడు. తిరుగులేని సంపదను కూడా బెట్ట గలిగినాడు. రామోజీ రావు, దీరూభాయీ అంబాని, బిల్ గేట్స్ ....ఇప్పుడు కోటీశ్వరులు. ఒకప్పుడు...?

మరి అలా సంపాదించాలంటే ఏం చెయ్యాలి?

పాతికేళ్ళు కస్టపడి చదివితే ఇంజనీరో, చార్టెడ్ అకౌంటెంట్, డాక్టరో   అవుతాడు.నెలకు సరిపడే జీతం. అతను తనపై ఆధారపడ్డ వాల్లును పోషిస్తూ ఇంటిని నిర్మించుకోవడానికి ఎన్నేళ్ళు కష్టపడాలి! చదవడం వేస్ట్ కాదు. చదివిన చదువును ఎలా ఉపయోగించు కావాలన్నదే నా ప్రశ్న? మందు’ కనుక్కున్న    డాక్టర్ కోట్లు సంపాదించవచ్చు. దాన్ని మార్కెట్ చేసిన బిజినెస్ మెన్ కూడా ధనవంతుడై పోవచ్చు. మంచి టవర్ నిర్మించిన ఇంజనీర్ తన పేరును శాశ్వతంగా నిలుపుకోవచ్చు....అంతేగాని ఇంకోక్కరి దగ్గర పనిచేస్తూ తన జాబ్ సెక్యూరిటీని తలచుకుంటూ బ్రతక కూడదు! అందరూ అలా ఆలోచిస్తే ఎలా? ఆలోచించరు. ఎందుకంటే చాలా మంది 'రిస్క్' తీసుకోరు. కంఫర్ట్ జోన్ లో ఉండిపోతారు. ఇది వాస్తవం! మరి అంత డబ్బు సంపాదించినవారు  నీతిగా సంపాదించారా? తన అలోచనలకు తనకే నవ్వొచ్చింది. చట్టం వేరు. నీతి వేరు! చట్టప్రకారం ముప్పయి శాతం పన్ను కట్టాలి. న్యాయంగా సంపాదనంతా చూపించాలి. చాలా మంది ఏమీ లేని వాళ్ళు కోటీశ్వరులు అయ్యారనీ వింటున్నాం. చూస్తున్నాం. మరి వాళ్ళు తమ సంపాదనలో అంత మొత్తానికి టాక్స్ కట్టారా? చట్ట ప్రకారం మాత్రమె చెల్లిస్తున్నారు! అందరూ నీతిగా పన్నులు కడితే దేశం ఇలా ఉండేది కాదు!!

వాళ్ళు చట్ట ప్రకారం డబ్బు సంపాదిస్తున్నారుకాబట్టి చట్టం వాళ్ళ జోలికి పోదు. నిజానికి చట్టం చేసే వ్యక్తులు, న్యాయాన్ని కాపాడే వ్యక్తులు వాళ్ళ చుట్టూ ఉంటారు! ఇక వాళ్లకు అడ్డు ఎవ్వరు? అవసరానికి మించి డబ్బు సంపాదిస్తే చాలు. ఆతరువాత డబ్బే డబ్బును సంపాదిస్తుంది. డబ్బుంటే చాలు. ఏమైనా చెయ్యొచ్చు. చట్ట ప్రకారం మనదేశాలలో చాలా మంది మోసాలు చేస్తున్నారు. అలా చేస్తే 'గొప్ప' వాళ్లవుతాం. కోట్లు సంపాదించడానికి వీలవుతుంది. లేకపోతే మామూలుగా బ్రతకాలి.

డబ్బు సంపాదించడం చేతగాని వాళ్ళే తాము చాలా నిజాయితీ పరులమనీ, కాబట్టే తాము సంపాదించ లేదనీ  తమవైపు వాదనల్ని బలవంతంగా నిర్మిచుకుంటారు. ఇతరులపై తమ అభిప్రాయాలను రుద్దుతుంటారు. అతనికి కోటయ్య గుర్తుకు వచ్చాడు. ఆయన ఇప్పుడు కోటీశ్వరుడు. ఒకప్పుడు ఏమీ లేని వ్యక్తి! మరి అంత డబ్బు ఎలా సంపాదించాడు?

చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళతో చేతులు కలిపి క్వారీ దగ్గర పనిచేసే వాళ్ళను చంపి, సరుకును రాత్రుల్లో చేతులు మార్పించి లక్షలు సంపాదించారంటారు కొంతమంది. ప్రజల్ని చంపి వాళ్ళ ఆస్తుల్ని దోచుకుని ఫ్యాక్షన్ రాజకీయాలతో కోట్లు సంపాదించారంటారు మరికొంతమంది. నిజమెంతో దేవుడికే తెలియాలి! మరి దీన్ని పాజిటివ్ గా ఎలా తీసుకోవాలి?

"అతడి తెలివి తేటల్ని. ధైర్యాన్ని".

మాటల్ని తలచుకుని మళ్ళీ నవ్వుకున్నాడు. తరువాత అతని ఆలోచనలు మద్యం వ్యాపారి ధర్మారావు పైకి వెళ్ళాయి.

దొంగ తనంగా మద్యం తయారు చేయడం. అమ్మడం. ఎక్సైజ్ వాళ్లకు తెలియకుండా సరుకు రవాణా చేయడం. అతడు చేస్తున్నవన్నీ మోసాలే! అతడి గురించి పాజిటివ్ గా ఎలా ఆలోచించాలి. "దొంగ తనంగా ఒక లోడ్ లారీని పంపించాలంటే అది గమ్య  స్థానం చేరే వరకు ఎన్ని టెన్సన్స్ అనుభవించాలి.  పోలీసులకు దొరక్కుండా ఎన్ని ప్లాన్స్ వేయాలి. ఎన్ని నిద్రలేని రాత్రులు గడపాలి....అమ్మో తలచుకుంటేనే భయమేస్తుంది!. అంతరిస్క్ ఉంది కాబట్టే వాళ్ళు అంత సంపాదిస్తున్నారు!! ...అంటూ సాగిపోతున్న ఆలోచనలు ఎవరో 'విజయ్' అని తనను పేరు పెట్టి పిలవడంతో  అలోచనలకు బ్రేక్ పడింది.

ఎక్కడో విన్న గొంతు అనుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు.

తన డిగ్రీ క్లాస్ మేట్ శేఖర్ కన్పించాడు.

" ఏరా! ఎన్నాళ్ళయింది  నిన్నుచూసి. బావున్నావా? ఏమిట్రా ఆలోచిస్తూ పోతున్నావ్. పిలిచినా పలక్కుండా అలా పోతున్నవేమిటీ...?" పెద్ద పెద్ద అడుగులతో అలా దగ్గరికి వస్తూ అడిగాడు శేఖర్.

" ఏం లేదు. బావున్నావా? చాలా కాలమైంది  నిన్ను  చూసి. ఎక్కడున్నావ్? డిగ్రీ తరువాత విడిపోయిన మనం ఇలా కలుసుకోవడం నాకు చాలా సంతోషం గా ఉంది. చెప్పరా. ఎలా ఉన్నావ్?".

బావున్నానన్నాడు.

"చెప్పరా. ఏం చేస్తున్నావ్?".

"నేను. శిరీష ఇండస్ట్రీస్ లో పని చేస్తున్నాను".

"శిరీష ఇండస్ట్రీస్ లో నా!?"

"అవును. అలా ఆశ్యర్య పోతావేంటీ! కంపెనీ నీకు తెలుసా?"

" కంపెనీ గురించి మంచిగా విన్నాను. కంపనీలో జాబ్?".

"కంపెనీ సెక్రటరీ. ప్రొప్రయిటర్ ఆనందరావు పర్సనల్ అడ్వైజర్. కంపెనీ లీగల్ అడ్వైజర్. రకంగా చెప్పాలంటే ఆయనకు 'అన్నీ' నేనే. నేనేమీ చెబితే అదే ఫైనల్. ఆయనకు నా మీద చాలా నమ్మకం, గౌరవం ఉన్నాయి".

"గుడ్. అయితే లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నావన్నమాట".

"ఎస్. అయితే ఆనందం ఎక్కువ రోజులు ఉండేటట్లు లేదు..త్వరలో మా కంపెనీ మూత పడబోతోంది!" దిగులుగా అన్నాడు.

ప్రక్కన  బాంబు పడ్డట్లు అదిరి పడ్డాడు విజయ్.

"వ్వాట్! నిజమా!"

"అవును. కంపెనీ నష్టాల్లో ఉంది. కావున అమ్మే ఆలోచనలో ఉన్నాడు మా యజమాని".

శేఖర్ మాటలు వింటూనే తన ఆలోచనలో పడిపోయాడు.

అది చూసి శేఖర్ అన్నాడు." ఎరా! మాటిమాటికీ అలా ఆలోచనలో పడి పోతున్నావ్. త్వరగా పెళ్లి చేసుకోరా. ఆలోచనలు తగ్గుతాయ్. వ్యవహారం ఇలా  నాన్చుతూ పోతే నేనే   సంబంధం చూసి పెళ్లి చేసేస్తాను..."

విజయ్ మాటల్ని అంతగా ఎంజాయ్ చెయ్యలేదు!

"అద్సరే గానీ అంత తొందరగా ఫ్యాక్టరీని అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది..." తెలుసుకోవాలనే కుతూహలంతో అడిగాడు.

"దానికి చాలా కారణాలున్నాయి. జీతాలు  బకాయిలు. సరుకు నిల్వలు. మా  యజమాని మంచితనాన్ని ఆసరాగా చేసుకుని తిరిగి ఇవ్వని అప్పులు.  బాడ్ డేట్స్. వీటికి తోడు కరెంట్ కస్టాలు.....అన్నీ ఒకేసారి చుట్టూ ముట్టాయి".

"మీ ఫ్యాక్టరీ విలువెంత?"

"సుమారు వందకోట్లు!. అయితేనేం. నష్టాల్లో ఉంది. ఫాతిక కోట్లు అప్పు లున్నాయి. ఫ్యాక్టరీ రన్ చేయాలంటే మరో ఫాతిక తక్షణమే కావాలి. అమ్మితే అప్పులు పోగా పది కోట్లు కూడా మిగిలేలా లేదు. ఎవ్వరూ కొనే టట్లు లేదు!".


" మీ యజమాని తో మాట్లాడు. ఫ్యాక్టరీ నేను కొంటాను. అప్పులు,బకాయిలన్నీ నేనే చూసుకుంటాను. ఫాతిక కోట్లు ఇస్తాను".

మాటలు విని శేఖర్ ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాడు.

"వ్వాట్! జోక్ చేస్తున్నావా?"

"లేదు. నిజమే చెబుతున్నాను".

మాటలకు విజయ్ వైపు చూశాడు. అతని ముఖం లోని సీరియస్ నెస్ చూసి 'నిజమే' అనుకున్నాడు. అయినా  తనకు కలిగిన సందేహాన్ని. వీడకుండా "అంత డబ్బు నీ దగ్గర..." అంటూ అర్దోక్తి గా ఆపు చేశాడు.

అప్పటికప్పుడు తన మనసులో రూపు దిద్దు కున్న ప్లాన్ బయట పెట్టకుండా 'నాకు డబ్బులేచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను తలచుకుంటే అలాంటివి చాలా కొనగలను!'.

"అయితీ నీవు బినామీవన్నమాట!"

మాటలకు చిన్నగా నవ్వాడు విజయ్. అదే నిజమని నమ్మాడు శేఖర్.

"అయితే నీవు నాకొక సహాయం చేయాలి" అని అడిగాడు విజయ్.

"తప్పకుండా. చెప్పు. ఏమిటది?" ఆత్రుతతో అడిగాడు శేఖర్.

విజయ్ చెప్పాడు.

అంతా విని సరే నన్నాడు శేఖర్.

ఫ్యాక్టరీ తన సొంతం అయిన తరువాత "మామా! చూడు నీ ఫ్యాక్టరీ కొన్నాను. ఇప్పుడు నీ కూతుర్ని  ఇస్తావా ? పెళ్లి ముహూర్తం ఎప్పుడో చెప్పు..." అని అడగాలనుకున్నాడు.

అయితే ఫ్యాక్టరీ తన 'సొంతం' కాగానే తన మనసు మారిపోతుందని ఊహించలేక పోయాడు.

*****

1 comment:

Srikanth Reddy Nellore said...

katha interesting gaa undi