Sunday, April 28, 2013

రూలర్ కథ -03


కాలింగ్ బెల్ మ్రోగింది.

శబ్దానికి విజయ్ కి మెలకువ వచ్చింది. "ఇంత రాత్రిపూట తనకోసం ఎవరొచ్చారబ్బా..." అనుకుంటూ వచ్చి తలుపు తెరిచాడు.

అతనికి ఎదురుగా శిరీష కనిపించింది!

పూర్తిగా నిద్రమత్తు వదిలిపోయింది. ఒక్కక్షణం తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. బంగారంతో చేసినట్లు అందంగా ఉంది. కలువరేకుల్లాంటి కళ్ళు అంటారు అవి ఎలా ఉంటాయో తెలియదు గాని అమ్మాయి కళ్ళు బాగున్నాయి. తీర్చి దిద్దిన కనుబొమ్మలు ఆర్చి షేపులో ఉన్న స్వాగత ద్వారాల లాగా అందంగా కనబడుతున్నాయి...అనుకుంటూ తదేకంగా కన్నార్పకుండా ఆమెనే చూస్తుండిపోయాడు.

ఆమె కొద్దిగా కంగారుపడింది. "నాపేరు శిరీష. విలేకరి. ఆరోజు ఎమ్మెల్యే మనుషులు... మీరు .సి.పి... నన్ను గుర్తుపట్టలేదా?" గుర్తు చేసింది.

మాటలకు ఆలోచనలోంచి తేరుకున్నాడు. "రా...లోపలికిరా" అంటూ ఆహ్వానించాడు.

ఫ్లవర్ బోకే చేతిలో పెట్టుకొని వయ్యారంగా లోపలి నడిచి వచ్చింది. దివి నుండి భువికి దిగి వచ్చిన దేవతలా ఉంది... అనుకున్నాడు. వెంటనే తనకు ఇలాంటి ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయి. వయసు ప్రభావం చేతనా? ఇంతవరకు అమ్మాయిని పరిశీలనగా చూడని తనకు ఈమెపై ఇంట్రెస్ట్ ఎందుకు కలుగుతోంది?... అని అలోచిస్తున్న అతనికి అమ్మాయి మాటలతో బ్రేక్ పడింది.

"హమ్మయ్య! నన్ను చూసి నప్పుడు మీరు మౌనంగా ఉంటే భయపడ్డాను. అటునుంచి ఆటే పొమ్మంటారనుకున్నను.

"సడెన్ గా  మిమ్మల్ని అలా చూసేసరికి...."

ఆమాటలకు ఆమె నవ్వేసింది. తిరిగినవ్వింది. అందంగా నవ్వింది. అక్కడ వెన్నెల వాన కురిసినట్లయ్యింది.

సరిగ్గా  అప్పుడే అలారం మ్రోగింది. సమయం పన్నెండు  గంటలు అయ్యింది.  ఆమె తన చేతిలో ఉన్న బోకే అతనికి అందిస్తూ, "విష్ యూ హ్యాపీ బర్త్ డే టూ యూ..." అంది.

సంతోషంతో బోకే అందుకున్నాడు. ఆమె కళ్ళ లోకి చూశాడు. ఆమె కళ్ళు ప్రశాంతంగా  ఉన్నాయి.

తనొక అనాధ. తన కెవ్వ రూ లేరన్న భావనతో బ్రతుకుతున్న అతనికి అందమైన యువతీ, అదీ అర్ధరాత్రి పూట  శుభా కాంక్షలు చెప్పేసరికి సంతోషం పట్టలేక ఆనంద డోలికల్లో ఊయలు ఊగుతున్నాడు. అతనికి ఆమెను మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. ఏదో కొత్త శక్తి, ఉత్సాహం శరీరం లోకి ప్రవేసించినట్లనిపించింది. ఏదో అధ్బుతాన్ని  చూసినట్లు, ఎవరి సహాయం లేకుండా మొదటిసారి సైకిల్ త్రోక్కినట్లు, శ్రావ్యమైన సంగీతం వింటున్నట్లు, పందెంలో గెలిచినట్లు, ఉప్పొంగి పోయాడు. అయితే అంత సంతోషాన్ని అతడు పైకి కనపడనివ్వలేదు.

" రోజు నా పుట్టినరోజని మీకెలా తెలుసు..?" తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ తో అడిగాడు.

ప్రశ్నకు ఆమె సూటిగా సమాధానం చెప్పలేదు.

" ఆరోజు మిమ్మల్ని మొదటసారి చూడగానే 'ఏదో' చెప్పలేని  ఆత్మీయత చోటుచేసుకుంది. అది 'ఇదీ' అని చెప్పలేని ఫీలింగ్! తరువాత నా  కెందుకో తెలియదుగానీ మిమ్మల్ని చూడాలనిపించింది. మీతో మాట్లాడాలనిపించింది. ఇంట్లో వాళ్ళీమి మాట్లాడినా తలూపడం తప్ప వారితో సరిగా మాట్లాడలేక పోయాను! క్షణం మీ గురించే ఆలోచనలు. ఏమీ తినాలనిపించలేదు. తాగాలనిపించలేదు. బెడ్ మీదకు చేరాను. మిమ్మల్ని మర్చిపోదామని పుస్తకం తీసుకున్నాను. చదవడం కష్టమైంది. వాక్యానికీ, వాక్యానికీ నడుమ నీ రూపం కన్పించేది! పుస్తకం మూసేశాను. నిద్రకోసం గట్టిగా కళ్ళు మూసుకున్నాను. నిద్ర కోసం అటూ, ఇటూ పొర్లాను. ఏవేవోకలలు. కళ్ళనిండా మెరుపులు. హృదయం పట్టలేనంతగా ఆశలు. మిమ్మల్ని తక్షణమే చూడాలనిపించింది. నా మనసుకు తెలిసిపోయింది ఇక నిద్ర రాదని!  అప్పడు టైం చూశాను. రాత్రి పదకొండు గంటలు. లేచి వెళ్లి ల్యాప్ టాప్ తీసుకున్నాను.


" మీకోసం మీ కాలేజ్ వెబ్ సైట్ లో వెతికాను. దొరకలేదు. చివరకు పేస్ బుక్ లో మిమ్మల్ని  చూసాను. మీ ఫోటో మీద నుంచి దృస్టి మరల్చి అటూ, ఇటూ చూశాను. మీ పుట్టిన రోజు కాలం దగ్గర నాకళ్ళు ఆగిపోయాయి. ఫార్ములా కనుక్కున్నా సైం టిస్ట్ లా సంతోషంతో పొంగి పోయాను”.

“వెంటనే బయలు దేరి సిటీ అంతా తిరిగాను. ఎక్కడా పువ్వులు దొరకలేదు. అన్ని షాపులు మూసేశారు. చివరకు మా ఇంటికి వెళ్లాను. నేను ఎంతో అపురూపంగా పెంచుకున్నతోటలో  పూలు కోసి, అందంగా కట్టి మీకోసం తీసుకొచ్చాను...”అని చెప్పడం ఆపి,అతని వైపు చూసింది.

ఆమె మాటల మకరందాన్ని ఆస్వాదించాడు. ఆనంద పరవశంతో పొంగి పోయాడు.

ఎన్తూ బాగా చెప్పాలనుకున్నాను. చెప్పలేకపోయాను. ఇంకా బాగా చెప్పుంటే బావుండేది .ప్ఛ్.. అనుభవం లేను పనులు ఇలాగే ఉంటాయి. అని తనలోతనే తిట్టుకుంది. అతను కన్నార్పకుండా తననే చూస్తున్నాడని గ్రహించి కొద్దిగా సిగ్గుపడుతూ తలవంచుకుంది.

"నన్నెందుకు చూడలనుకున్నావు? ఇంత రాత్రిపూట నాతో ఏమి మాట్లాడాలనుకున్నావు?..." ఆమె నోటితో వినాలనే చిన్ని ఆశతో అడిగాడు.

ఆమె సమాధానం చెప్పలేదు. చుడీదార్ అంచుల్ని చేతి వ్రేలితో చుట్టుకుంటూ అందంగా సిగ్గుపడుతోంది. చూడ్డానికి దృశ్యం మనోహరంగా ఉంది.

"ఏదో చెప్పాలనుకుంటున్నావు. పర్లేదులే చెప్పు. ఎలా మొదలెట్టాలని ఆలోచించనక్కరలేదు. నీ ఇష్టం వచ్చినట్లు, నీ మనసులో ఉన్నది ఉన్నట్లు, చెప్పాలనుకున్నది చెప్పు..."

“మన పితృస్వామ్య వ్యవస్థలో మంచి అమ్మాయిలు మనసులోని మాట  చెప్పలేరు! అలా చెబితే 'మంచి' అన్న పేరుకు చిన్నదో, పెద్దదో భంగం కలుగుతుందని వారి భయం.  తన మనసైన మనిషికి మనసు విప్పేద్దామని సిద్దపడిన ప్రతిసారీ 'నేను కొంచెం ఫాస్ట్ ' అని అనుకోదుకదా! అన్న సందేహం  వారిని వెనకడుగు వేయిస్తోంది”.

అయితే చాలా మంది కుర్రాళ్ళు అమ్మాయిలు తమను ప్రేమించాలనీ, తమకంటే ముందే  వాళ్ళు తమతో ప్రేమ విషయం చెప్పాలని ఆరాట పడుతుంటారు! విజయ్ ఆరాటం కూడా అటువంటిదే!!”

అతని కళ్ళలోకి  చూస్తూ అడిగింది. "నేనంటే నీకు ఇష్టమేనా?".

వెంటనే సమాధానం చెప్పలేదు విజయ్. కొన్ని సెకండ్ల ఆలస్యానికే కోపం కలిగింది ఆమెకు. "ఇష్టమైతే ఇష్టమనీ, లేకుంటే లేదని చెప్పాలి. అంతేకాని ఇలా మౌనంగా ఉండడమెందుకు? టెన్షన్ క్రియేట్ చెయ్యడం దేనికీ?..."అనుకుంది.

కాస్త ఆలోచించి "ఇష్టమే నన్నట్లు " తలూపాడు.

శిరీష కు చా లా సంతోషం కలిగింది. మనసంతా ఆనందంతో పరవళ్ళు త్రోక్కింది. పైకి లేచి డాన్సు చెయ్యాలనీ, అతడ్ని కౌగిలిలో బంధించాలనీ, ముద్దులతో ముంచెయ్యాలనే అలోచన కలిగింది. అమ్మాయి ఆనందానికి బ్రేకులు వేస్తూ అతను ప్రశ్నించాడు.

"నన్నెందుకు ఇష్టపడ్డావు ?"

ఆమె ఉత్సాహంగా కొద్ది గా ముందుకు వంగి చెప్పడం ప్రారంభించింది.

"మనచుట్టూ ఉన్న వ్యక్తులూ అంటే మన తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు... ఇలా  వీళ్ళందరిలో మనకు కొన్ని లక్షణాలు మాత్రమే మనకు నచ్చుతాయి. అలాంటి లక్షణాలు  అన్నీఉన్నఅమ్మాయి లేదా అబ్బాయి మనకు తారస పడగానే భార్య లేదా భర్త గా వస్తే బావుంటుందని మనకు అనిపిస్తుంది... మనకు తెలిసో తెలియకో అలాంటి అభిప్రాయాన్ని మనసులో ఏర్పరచు కుంటాం . సహజంగా మన కళ్ళు అలంటి 'తగిన' వ్యక్తీ కోసం అన్వేషిస్తుంటాయి. అలాంటి వ్యక్తి కనపడగానే మనం ప్రేమలో పడిపోతాం. అదే ప్రేమంటే!".

"శిరీషా! నేనతే నీకు ఇష్టమేనా? అని అడిగినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. మాటల్లో చెప్పలేనంత  ఆనందం కలిగింది. నిజానికి మిమ్మల్ని మొదటి సారి చూసినప్పుడే ప్రేమించాను. అయితే నేనొక అనాధను. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశయం ఉన్నట్లే నాకూ కొన్ని కోరికలున్నాయి. మంచి కుటుంబం లోని అమ్మాయిని పెళ్లి చేసుకొని, వాళ్ళతో కలిసిపోయి అనాధ అనే ఫీలింగ్ వదిలించుకోవాలని ఉంది. మీనాన్న కోటీశ్వరుడు. పేరు ప్రతిష్ట లున్న వ్యక్తి. పెళ్ళికి ఒప్పుకుంటే సమస్యలేదు. లేకుంటే..." తరువాత మాటలు రానట్లు అర్థోక్తిగా ఆపు చేశాడు.

"మీలో మీరే ఏదేదో ఊహించుకుంటే ఎలా? మా డాడీ పుటకతోతోనే ధనవంతుడు కాదు. శారీరక శ్రమకు తన తెలివి తేటల్ని జోడించి అహర్నిశలు కష్టపడి పైకి వచ్చాడు. పది మంది అసూయ పడే ఇప్పటి పొజిషన్ కు చేరుకున్నాడు. మా డాడీ డబ్బులున్న వ్యక్తి మాత్రమే కాదు. పేదలపై, పిల్లలపై ప్రేమ ఉన్న వ్యక్తి కూడా!".

"అందరూ తమ తమ తల్లిదండ్రుల గురించి ఇలాగే చెప్తారు! అనుకుంటారు. విచిత్రమేమిమటంటే వాళ్ళు కూడా సినిమాలో లైలా-మజ్నూ, సలీం-అనార్కలీ, పార్వతి- దేవదాసు ప్రేమలు... చూసి ఆహా,ఓహో అంటారు. తమ సొంత కొడుకో, కూతురో ప్రేమలో పడితే రక్తం కళ్ళ చూస్తారు!".

"మీరు నన్నేమైనా అనండి భరిస్తాను. మా డాడీ గురించి ఇంకొక్క మాట కూడా మాట్లాడకండి. మీరనుకుంటున్నట్లుగా డబ్బు పిచ్చి మా నాన్నకు లేదు! నాకోసం మా డాడీ ఏమైనా చేస్తాడు!".

ఆమె హర్ట్ అయ్యిందని గ్రహించాడు. క్షణం సేపు వాళ్లిద్దరి మద్య మౌనమే రాజ్యం చేసింది.

"సారీ శిరీష! తప్పుగా మాట్లాడాలనే ఉద్దేశ్యం నాకు లేదు. నాకున్న సందేహాన్ని వ్యక్తం చేశాను.నీకు కోపం వస్తే క్షమించు. మీనాన్న ఇంట్లో ఉన్నప్పుడు మెసేజ్ చెయ్యి. నేనొచ్చి మాట్లాడతాను...సరేనా?".

"పర్లేదు. మీ అనుమానం తప్పులేదు! సారీ వచ్చి మానాన్నతో మాట్లాడండి. మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు! ..."అంది నమ్మకంతో.

తరువాత వెళ్ళడానికి పైకి లేచింది.

అతనుకూడా అమ్మాయితో అలా  కారు వద్దకు వెళ్ళాడు.


*****

3 comments:

Anonymous said...

Cute love story

Mullapoodi Lakshmi said...

సూపర్ లవ్ స్టోరీ ....కథ బావుంది. సినిమా గా వస్తే చూడాలని ఉంది.

Venkatesh choudary Bangalore said...

good story ...worth reading!